రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ
దౌలతాబాద్: మండలంలోని పెద్ద ఆరిపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి పనుల్లో భాగంగా మంగళవారం స్థానిక శాసన సభ్యుడు ముత్యంరెడ్డి సీసీ రోడ్ల నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్ల నిర్మాణానికి సుమారు రూ. 11లక్షలు వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామనాయకులు పాల్గొన్నారు.