రోలర్ స్కేటింగ్ లో రితీష్ కు బంగారు పతకం

 

వరంగల్ ఈస్ట్, అక్టోబర్ 17(జనం సాక్షి)

 

వరంగల్ నగరంలోని కరీమాబాద్ కివి పబ్లిక్ స్కూల్లో ఏడవ తరగతి చదువుతున్న గుండేటి రితీష్ కు రోలర్ స్కేటింగ్ లో బంగారు పతకం లభించింది. ఈ మేరకు పాఠశాల ప్రిన్సిపాల్ దాసి సతీష్ మూర్తి సోమవారం తెలిపారు. కిలా వరంగల్ లో ఆదివారం నిర్వహించిన తొమ్మిదవ వరంగల్ జిల్లా రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ విభాగాలలో జరిగిన పోటీలలో విద్యార్థి రితీష్ బంగారు పథకం సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థి రితీష్ ను పాఠశాలలో అభినందించారు. ఈ కార్యక్రమంలో దాసి సతీష్ మూర్తి తో పాటు అన్నదేవర ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.