రో’హిట్‌’ పుణే ‘ఫట్‌’

– చెలరేగిన శర్మ
-32బంతుల్లో 62పరుగులు
– రాణించిన సచిన్‌
– పూణెపై ముంబైై విక్టరీ
వాంఖడే:ఐపీఎల్‌6లో భాగంగా ముంబై ఇండియన్స్‌ ,పుణె వారియర్స్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ముంబై జట్టు 41పరుగుల తేడాతో గెలుపొందింది.టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబైజట్టు నిర్ణీత 20ఓవర్లలో 3వికెట్లు కోల్పోయి 183పరుగులు చేసింది.ముంబై ఇంండియన్స్‌ ఆటగాళ్లు రోహిత్‌ శర్మ (62)సచిన్‌ (44)కార్తిక్‌(41)పరగులు సాధించారు. ఈ మ్యాచ్‌లో సచిన్‌ ఒకే ఓవర్ల్‌ఓ వరుసగా నాలుగు ఫోర్లు కొట్టి దూకుడుగా ఆడినట్లు కన్పించినాఫించ్‌ బౌలింగ్‌లో మార్ష్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.62పరుగులు చేసి రోహిత్‌ శర్మ అజెయంగానిలిచాడు.పూణే బౌలర్లలో పించ్‌ ,యువరాజ్‌,మార్ష్‌లు తలో వికెట్‌ తీశారు.184పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పుణెవారియర్స్‌ నిర్ణీత 20ఓవర్లలో 8వికెట్లు కోల్పోయి 142పరుగులు మాత్రమే చేయగలింది.ఓపెనర్లు పించ్‌ డకౌట్‌ కాగా ఉతప్ప 7పరుగులు చేసి మాత్రమే వెనుదిరిగాడు.యువరాజ్‌ సింగ్‌ 24పరుగులతో కాసేపు క్రీజులో నిలిచినా పొలార్డ్‌ బౌలింగ్‌లో దావన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.చివరిలో మార్ష్‌ కొంత ముంబై బౌలర్లపై ప్రతిఘంటించినా ఫలితం లేకపోయింది.ముంబై బౌలర్లలో మిచెల్‌ జాన్సన్‌ 3వికెట్లు తీసి ముంబై గెలుపులో కీలక పాత్ర పోషించాడు.ఓజా,హర్భజన్‌,మలింగా,పోలార్డ్‌ తలో వికెట్‌ తీసుకున్నారు.62పరుగులతో మ్యచ్‌ లో అత్యదిక పరుగులు చేసిన రోహిత్‌ శర్మ మ్యాన్‌ఆఫ్‌ద మ్యాచ్‌ అందుకున్నారు. ఈ విజయంతో ముంబై ఇండియన్స్‌ జట్టు 6పాయింట్లతో అగ్రస్థానంలో నిల్చింది.
తుది ముంబై
రికీ పాటింగ్‌, జాన్సన్‌, కీరన్‌ పోలర్డ్‌, మలింగ, హర్భజన్‌ సింగ్‌, దినేష్‌ కార్తిక్‌, సచిన్‌, రోహిత్‌ శర్మ, రిషీ దావన్‌, ప్రగ్యాన్‌ ఓజా, అంబటి రాయుడు,
వికెట్ల పతనం : 1-54(పాంటింగ్‌ 7.1), 2-60(సచిన్‌ 8.2), 3-115(కార్తిక్‌ 15.1)
తుది పూణె
టేలర్‌, రాభిన్‌ ఉతప్పా, యువరాజ్‌ సింగ్‌, అభిషేక్‌ నాయర్‌, అశోక్‌ దిండా, ఆంగ్లో మాథ్యూస్‌, తిరుమల శేట్టి సుమన్‌, భువేనేశ్వర్‌ కుమార్‌, మిట్చెల్‌ మార్ష్‌, రాహుల్‌ శర్మ, ఆరోన్‌ ఫిచ్‌
వికెట్ల పతనం: 1-0 ( ఫిచ్‌ 0.1), 2-5 ( టేలర్‌ 1.1), 3-13 ( ఊతప్పా 2.3), 4-38 (సుమన్‌ 5.2 ), 5-71 (యువరాజ్‌ 9.4), 6-89 (మాథ్స్యూ 12.2 ), 7-120 (నాయర్‌ 7.5), 8-98 (మార్ష్‌ 16.4)