ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సేవలు అమూల్యం
హైదరాబాద్,అక్టోబర్ 7 (జనంసాక్షి):
శాంతి భద్రతల పరిరక్షణకు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్‌ఎఎఫ్) సేవలు అభినందనీ యమని రాష్ట్ర గవర్నర్ నరసింహన్ అన్నారు. శామీర్‌పేట మండలంలోని హకీంపేటలో ఆర్‌ఎఎఫ్ 99వ బెటాలియన్ 20వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలన ఈరోజు ప్రారంభిం చారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ దేశంలో అత్యవసర పరిస్థితులు ఎదురైనపుడు శాంతి భద్రతల పరిరక్షణకు ఆర్‌ఏఎఫ్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. సమాజ రక్షణకు వారి కుటుంబాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తున్నారని కొనియాడారు. అంకితభావంతో సేవలందిస్తున్న ఆర్‌ఎఎఫ్‌కు సమాజంలో మంచి గౌరవం ఉందన్నారు. సీఆర్‌పీఎఫ్ డీజీ ప్రణయ్ సహాయ్, ఐజీ ఆర్‌ఎన్ మిశ్రామరో ఐజీ వల్సా పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ
ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సేవలు
అవసరాలు, ఆదేశాల మేరకే రాపిడ్ యాక్షన్ ఫోర్స్ పనిచేస్తుందని, ఆర్‌పీఎఫ్ పనితీరుపై ప్రభుత్వాలు సంతృప్తికరంగా ఉన్నాయని సీఆర్‌పీఎఫ్ డైరెక్టర్ జనరల్ ప్రణయ్ సహాయ్ అన్నారు. సీర్‌పీఎఫ్, ఆర్‌ఎఎఫ్ సిబ్బంది పనితీరు మెరుగుపరచుకునేందుకు త్వరలోనే మీరట్‌లో జాతీయ ప్రజానిర్ధేశన, నిర్వహణ సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న పది బెటాలియన్ల నుంచి ఎక్కడ ఎలాంటి అల్లర్లు జరిగినా స్పందిస్తున్నామని తెలిపారు. ప్రకృతి వైపరీత్యాల సమయాల్లోనూ తమ సిబ్బంది కీలకపాత్ర పోషిస్తున్నారని చెప్పారు.