లండన్ ఒలంపిక్స్ లో ఆదిలోనే పొరపాటు
గ్లాస్గో ( స్కాట్లాండ్) : లండన్ ఒలంపిక్స్‌లో ఆదిలోనే పొరపాటు దొర్లింది. క్రీడల నిర్వహకులు ఒక దేశం జెండా బదులుగా మరోదేశం జెండాను ప్రదర్శించి అబాసుపాలయ్యారు. ప్రారంభత్సోవం జరుగకముందే మొదలైన పుట్‌బాల్ పోటిల్లో బాగంగా గురువారం ఉత్తరకొరియా, కొలంబియాల మధ్య మ్యాచ్ జరిగింది. మ్యాచ్‌కు ముందు ఉత్తర కొరియా క్రీడకారిణులు గ్రౌండ్‌లోకి వస్తున్నప్పుడు బిగ్‌స్క్రిన్‌పై దక్షిణ కొరియా జెండా ప్రత్యేక్షమైంది. దీంతో త్రీవ్ర మానస్థాసం చేందిన ఉత్తర కొరియా క్రీడకారిణులు మ్యాచ్ ఆడబోమంటూ నిరసనకు దిగారు. ఐతే ఈ సంఘటన ఉద్దుశపూర్వకంగా జరిగింది కాదని, ఇకపై మరెప్పూడూ ఇటువంటివి జరగకూండా చూసుకుంటామని నిర్వహకులు క్రీడాకారులకు నచ్చజెప్పి మ్యాచ్‌ను ప్రారంబింపజేశారు. గలితంగా మ్యాచ్ గంట ఆలస్యంగా జరిగింది.