లక్నో రావాల్సిందిగా హరికృష్ణకు ఆహ్వానం

 

 

 

 

 

 

 

 

శివ్వంపేట సెప్టెంబర్ 13 జనంసాక్షి :
కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ జాతీయ స్మార్ట్ పంచాయతీ ల మీద ఈనెల 15,16 తేదీలలో నిర్వహిస్తున్న
ఉత్తరప్రదేశ్  రాష్ట్రం లక్నోలో  జాతీయ స్మార్ట్ ఈ పంచాయతీల మీద జరగనున్నఈ సమావేశానికి రావాల్సిందిగా జిల్లా ఎంపీపీల ఫోరం అధ్యక్షుడు, స్థానిక ఎంపీపీ  కల్లూరి హరికృష్ణకు మన  మెదక్ జిల్లా నుండి పాల్గొనేందుకు ఆహ్వానం వచ్చిందని స్థానిక ఎంపీడీవో కాసం నవీన్ కుమార్ మంగళవారం తెలిపారు.  ప్రభుత్వం నుంచి వచ్చిన ఆహ్వాన పత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయస్థాయిలో లక్నోలో  నిర్వహిస్తున్న అంశాలన్ని జాతీయ స్థాయిలో ఇతర రాష్ట్రాల ప్రతినిధులకీ తెలియచెప్పడానికి కల్లూరి హరికృష్ణ ఎంపీపీ శివ్వంపేట కు ప్రత్యేక ఆహ్వానం పంపించరని ఆయన గుర్తు చేశారు.