లక్ష్మణ్‌ బాపూజీ మృతికి భాజపా నేతల సంతాపం

హైదరాబాద్‌: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్‌ బాపూజీ మృతికి భాజపా రాష్ట్ర విభాగం సంతాపం ప్రకటించింది. తెలంగాణ ఉద్యమానికి బాపూజీ మరణం తీరని లోటని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సామభూతిని తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని చూడకుండానే బాపూజీ మృతి చెందడం దురదృష్టకరమని భాజపా నేతలు వ్యాఖ్యానించారు.