లక్ష్మా రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన టీఆరెస్ నాయకులు.

 

జనంసాక్షి/చిగురుమామిడి- సెప్టెంబర్ 7:

 

కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం లంబాడిపల్లె గ్రామములో సిపిఐ మండల కార్యదర్శి నాగెల్లి లక్ష్మా రెడ్డి మాతృమూర్తి ఈశ్వరమ్మ గత నాలుగు రోజుల క్రితం మృతి చెందగా బుధవారం పలువురు స్థానిక టీఆరెస్ నాయకులు వారి కుటుంబాన్ని పరామర్శించారు.
మృతురాలికి నివాలర్పిస్తూ, మృతురాలి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్నివ్వాలని భగవంతుణ్ణి ప్రార్థించారు.ఈకార్యక్రమంలో స్థానిక జడ్పీటీసీ సభ్యులు గీకురు రవీందర్, పన్యాల శ్యామ్ సుందర్ రెడ్డి, సింగిల్ విండో ఛైర్మెన్ జంగ రమణారెడ్డి, సాంబారి కొమురయ్య, రామోజు కృష్ణమ చారి,పాక్స్ వైస్ ఛైర్మెన్ కరివేద మహేందర్ రెడ్డి, ఎస్సి సెల్ అధ్యక్షుడు బెజ్జంకి అంజయ్య, మైనార్టీ సెల్ అధ్యక్షడు సర్వర్ పాషా, ఇందుర్తి ఉప సర్పంచ్ తోట సతీష్,సింగిల్ విండో డైరెక్టర్ తాళ్లపెల్లి తిరుపతి, బుర్ర శ్రీనివాస్, పోటు మల్లారెడ్డి,సుందరగిరి వార్డ్ సభ్యులు వంతడుపుల దిలీప్, పెసరి శ్రీనివాస్,నాగెల్లి రాజిరెడ్డి తదితరులు పరామర్శించారు.