లక్ష్మీనారాయణ బదిలీపై విచారణ వాయిదా
హైదరాబాద్,(జనంసాక్షి): సీబీఐ జాయింట్ కలెక్టర్‌గా లక్ష్మీనారాయణను కొనసాగించాలంటూ వేసిన పిటిషన్‌ను హైకోర్టు బుధవారం విచారణకు స్వీకరించింది. జేడీ లక్ష్మీనారాయణ బదిలీ అంశం హైకోర్టుకు వస్తుందా… రాదా అనే విషయాన్ని తెలపాలని న్యాయస్థానం పిటిషన్‌ను సూచించింది.
వారంలోగా సప్లిమెంటరీ పిటిషన్‌ను దాఖలు చేయాలని కోర్టు ఈ సందర్బంగా పిటిషనర్‌ను ఆదేశించింది. లక్ష్మీనారాయణ బదిలీ నిలిపివేయాలని జర్నలిస్టు కుటుంబరావు మూటు రోజుల క్రితం ఈ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. 2006 లో సిబిఐ జేడీగా బాధ్యతలు తీసుకున్న లక్ష్మీనారాయణ డిప్యూటేషన్ కాలం ఈ నెల 10 వ తేదీన ముగియటంతో ఆయన మంగవారం బాధ్యతల నుంచి రిలీవ్ అయ్యారు.