లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు నాటారు.

నెరడిగొండ ఆగస్టు21(జనంసాక్షి):
స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అదేశాలమేరకు జిల్లా కలెక్టర్ సూచనలకు అనుగుణంగా
ప్రణాళికాబద్ధంగా వన మహోత్సవాన్ని ఆదివారం రోజున మండలంలోని బోథ్ ఎక్స్ రోడ్డు సమీపంలో అర్బన్ పార్కు తోపాటు ప్రతి గ్రామ పంచాయతీ మండల పరిధిలోని ఫ్రీడం పార్క్ బృహత్ పల్లె ప్రకృతి వనంలో మల్టిలేయర్ ఎవెన్యూ ప్లాంటేషన్ రోడ్డుకు ఇరువైపులా ఖాళీ స్థలంలో మొక్కలను నాటేందుకు వివిధ శాఖల మండల అధికారులు ప్రజాప్రతినిధులు నాయకులు సర్పంచ్లు వార్డు మేంబర్లు భాగస్వాములై అందరూ కలిసి లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు నాటి వన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా జడ్పీటీసీ అనిల్ జాధవ్ మాట్లాడుతూ ప్రతిఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించి పర్యావరణ పరిరక్షణను కాపాడాలని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల జడ్పీటీసీ అనిల్ జాధవ్ ఎంపీపీ రాథోడ్ సజన్ ఎంపీడీఓ అబ్దుల్ సమద్ తహశీల్దార్ పవన్ చంద్ర ఎపిఓ వసంత్ రావు అటవీ శాఖ అధికారులు సంబంధిత వివిధ శాఖల అధికారులు వివిధ గ్రామ పంచాయతీ జీపీ సెక్రెటర్లు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
 

తాజావార్తలు