లగ్జరీ కార్లపై రవాణాశాఖ కొరడా
11కార్లను సీజ్ చేసిన అధికారులు
హైదరాబాద్,ఆగస్ట్16(జనంసాక్షి): లగ్జరీ కార్లపై రవాణాశృాఖ కొరడా రaళిపించింది. పన్నులు చెల్లించకుండా తిరుగుతున్న విదేశీ కార్లపై రవాణాశాఖ కొరడా రaులిపించింది. అక్రమంగా తిరుగుతున్న 11 ఖరీదైన కార్లను సీజ్ చేసింది. ఆరు నెలలుగా నగరంలో తిరుగుతున్న లగ్జరీకార్లపై నిఘా పెట్టిన రవాణా శాఖ.. డిప్యూటీ కమిషనర్ పాపారావు నేతృత్వంలో చర్యలకు దిగింది. సీజ్ చేసిన ఈ 11 వాహనాల నుంచి ప్రభుత్వానికి రూ. 5 కోట్ల నుంచి 8 కోట్ల వరకు పన్నుల రూపంలో రావాల్సి ఉందని అధికారులు తెలిపారు. విజిలెన్స్ విభాగానికి చెందిన 40 ఎంవీఐలు, ఎఎంవీఐలు వేర్వేరు బృందాలుగా విడిపోయి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పన్నులు చెల్లించకుండ తిరుగుతున్న వాహనాలను ఉపేక్షించబోమని అదికారులు స్పష్టం చేశారు. అధికారులు సీజ్ చేసిన వాహనాల్లో మెర్సిడెస్ బెంజ్, మాసరట్టి, ఫెరారీ, రోల్స్ రాయిస్, బీఎండబ్ల్యూ, లంబొర్గిని తదితర ఖరీదైన కార్లు ఉన్నాయి. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఖరీదైన కార్లకు 2వందల శాతం వరకు పన్నులు చెల్లించాల్సి ఉంటుందని, నిబంధనల ప్రకారం పత్రాలు పరిశీలించి ట్యాక్స్ వసూలు చేసిన తర్వాత ఆ కార్లను యజమానులకు అప్పగిస్తామని అధికారులు స్పష్టం చేశారు.