లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం

హుజూర్ నగర్ జులై 9 (జనం సాక్షి):  మండలంలోని అమరవరం గ్రామంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో సర్పంచ్ గుజ్జుల సుజాతఅంజిరెడ్డి లతో కలిసి హుజూర్ నగర్ జడ్పిటిసి కొప్పుల సైదిరెడ్డి ఐదుగురు లబ్ధిదారులకు 1,72,500 ల విలువైన చెక్కులను పంపిణీ  చేశారు. శనివారం ఈ సందర్భంగా జడ్పిటిసి కొప్పుల సైదిరెడ్డి మాట్లాడుతూ హుజూర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి నియోజకవర్గంలో సీఎంఆర్ఎఫ్ నిధుల ద్వారా కోట్ల రూపాయలను పేదలకు మంజూరు చేయిస్తున్నారు అన్నారు. వివిధ ప్రమాదాలకు దీర్ఘకాలిక రోగాలతో బాధపడే వారికి చికిత్సకోసం ఎల్ ఓ సి ల రూపంలో లక్షల రూపాయలు మంజూరు చేయించి  పేదల వైద్యానికి బాసటగా నిలబడుతున్నారు అని తెలియజేశారు. నియోజకవర్గ కేంద్రంలో ఉన్నటువంటి ప్రాంతీయ వైద్యశాలలో లింగగిరి ప్రాథమిక వైద్యశాలలో మౌళిక వసతుల కల్పనకు మెరుగైన వైద్య సౌకర్యం కోసం పూర్తి స్థాయి సిబ్బంది నియామకానికి విశేష కృషి చేశారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు పేదలకు కార్పొరేట్ వైద్యం అందించడం కోసం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా సహాయం  అందిస్తున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక వైద్య కళాశాలను వాటికి అనుబంధంగా ప్రభుత్వ ఆసుపత్రులను నెలకొల్పడంతో పాటు ఔషధాల కొరత లేకుండా చూడడం ద్వారా  పేదలకు మరింత వైద్యసేవలు అందించడానికి కృషి చేస్తున్నారన్నారు. కెసిఆర్ కిట్టు, అమ్మ ఒడి వంటి వినూత్న సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టడం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణ ప్రసవాలు పెరిగేలా చర్యలు చేపట్టారు అన్నారు.  ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బాల సైదులు, మాజీ సింగిల్విండో చైర్మన్ కామిశెట్టి వెంకటేశ్వర్లు, మండల పార్టీ ఉపాధ్యక్షులు ఉస్తేల లింగారెడ్డి,  షేక్ ముస్తఫా, సిద్ధం నాగరాజు, తేళ్ల సుగుణ, టిఆర్ఎస్ నాయకులు సాముల నాగిరెడ్డి, ముద్దుల లింగరాజు, సైదయ్య, శ్రీను, సైదమ్మ, లబ్ధిదారులు నాగయ్య, రామ్ రెడ్డి, పంచాక్షరి, వీరయ్య, నరేష్ తదితరులు పాల్గొన్నారు.