లయన్స్ క్లబ్ ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన..
కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభిస్తున్న మెట్పల్లి డి.ఎస్.పి వంగ రవీందర్ రెడ్డి..
మల్లాపూర్ ఆగస్టు 17 (జనం సాక్షి)
మల్లాపూర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించిందని మల్లాపూర్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు కనుక సంజీవ్ అన్నారు. రేకుర్తి కంటి వైద్య నిపుణులు 210 మందికి కంటి వైద్య పరీక్షలు నిర్వహించగా అందులో 120 మందిని ఆపరేషన్ నిమిత్తం రేకుర్తి కంటి ఆసుపత్రికి తరలించడం జరిగిందనీ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మెట్పల్లి డిఎస్పి వంగ రవీందర్ రెడ్డి పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ లైన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ద్వారా ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం చాలా గొప్ప విషయమని అన్నారు. కంటి చూపు లేని వారికి కంటిచూపు ప్రసాదించడం ప్రకృతిలో గొప్ప వరమని కొనియాడారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షుడు కనుక సంజీవ్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ద్వారా ఇప్పటివరకు 1100 మందికి ఉచితంగా కంటి ఆపరేషన్ చేయించామని అన్నారు, మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల సౌకర్యార్థం బస్ షెల్టర్ నిర్మాణం కూడా త్వరలోనే పూర్తి చేస్తామని అన్నారు. ఇంకా దాతల సహాయంతో మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాలలో సేవా కార్యక్రమాలు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి వంగ రవీందర్ రెడ్డి, జెడ్పిటిసి శ్రీనివాస్ రెడ్డి,లయన్ జోనల్ చైర్మన్ గంగుల మురళి, లయన్స్ క్లబ్ అధ్యక్షులు కనుక సంజీవ్, తహసిల్దార్ లకావత్ వీర్ సింగ్, ఎంపీడీవో జగదీష్, ప్రాథమిక ఆరోగ్య వైద్యాధికారి వాహిని రావు, ఎస్సై నవీన్ కుమార్, మల్లాపూర్ 143 ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ముత్యాల రమేష్, రీజినల్ సెక్రెటరీ రుద్ర రాంప్రసాద్, కార్యదర్శి తోటరాజిరెడ్డి, కోశాధికారి ఎర్రి జైపాల్ రెడ్డి, ఎంపీటీసీ ఆకుతోట రాజేష్, కాటిపల్లి ఆదిరెడ్డి, దేవ మల్లయ్య, ఈ కంటి వైద్య శిబిరానికి సహకరించిన లయన్స్ క్లబ్ సభ్యులు క్యాథం సురేష్ రెడ్డి, గడ్డం శ్రీనివాస్ రెడ్డి, మోర సతీష్, మహమ్మద్ రఫీ, భూక్య గోవింద నాయక్, ఏనుగు రామిరెడ్డి, సంఘ గంగరాజం, పుప్పాల మహేష్, తదితరులు పాల్గొన్నారు.