లాభపడుతున్న సెన్సెక్స్
హైదరాబాద్,(జనంసాక్షి): ప్రపంచ మార్కెట్ల నుంచి పాజిటివ్ సంకేతాలు రావడానికి తోడు దేశీయంగా కూడా సానుకూల వార్తలు రావడంతో సెన్సెక్స్ లాభపడుతుంది. ప్రస్తుతం 200 పాయింట్లకు సమీపంలో ట్రేడవుతుంది. నిఫ్టీ 85 పాయింట్లు లాభపడుతూ 5, 780కి సమీపంలో కొనసాగుతుంది. మే నెలలో స్థూల ద్రవ్యోల్బణం స్వల్పంగా తగ్గి 4.7 శాతానికి పరిమితం కావడం మార్కెట్‌కు పాజిటివ్‌గా మారింది.
ఏప్రిల్‌లో టోకు ధరల సూచీ 4.8 శాతంగా నమోదైంది. ఏప్రిల్ నుంచి మే నెల వచ్చేసరికి ద్రవ్యోల్బణం స్వల్పంగా తగ్గినందున రిజర్వ్ బ్యాంకు వడ్డీరేట్లు తగ్గించాలని ఆర్థిక శాఖతో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా కోరుతున్నాయి. మరోవైపు రూపాయి ఇవాళ 36 పైసలు లాభపడుతూ 57 రూపాయల 61 పైసల వద్ద ట్రేడవుతుంది.