లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ముంబయి: సోమవారం స్టాక్‌మార్కెట్లు లాభాలతో ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 292 పాయింట్లు లాభపడి 28,095 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 94 పాయింట్ల లాభంతో 8,635 వద్ద ముగిసింది. 2015 జులై తర్వాత నిఫ్టీ 8,600 మార్కును దాటడం ఇదే తొలిసారి. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 67.27 వద్ద కొనసాగుతోంది.
దేశీయ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో బీహెచ్‌ఈఎల్, బ్యాంక్ ఆఫ్ బరోడా, మారుతి సుజుకీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఏషియన్ పెయింట్స్ షేర్లు లాభపడగా.. డాక్టర్ రెడ్డీస్, గ్రాసిమ్, బజాజ్ ఆటో, టాటాస్టీల్, హిందాల్కో షేర్లు స్వల్పంగా నష్టపోయాయి.