లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు

55ముంబై: దేశీయస్టాక్ మార్కెట్లు దేశీ స్టాక్‌ మార్కెట్లు నష్టాలతో మొదలైనా క్రమంగా కోలుకుంటున్నాయి. ఆరంభంలో 100 పాయింట్లకుపైగా క్షీణించినా కొనుగోళ్ల మద్దతుతో  ప్రస్తుతం సెన్సెక్స్49 పాయింట్లలాభంతో 27,964 వద్ద  నిఫ్టీ 24 పాయింట్లు ఎగిసి 8639 వద్ద ట్రేడవుతోంది.  మెటల్స్‌, ఫార్మా, ఆటో లాభాల్లోనూ, బ్యాంకింగ్ రంగం నష్టాల్లోనూ ఉంది. మరోవైపు  నష్టాలను చవిచూసిన  టాటా  షేర్లు ఈ రోజు రీబౌండ్ అవుతున్నాయి. క్యూ2 ఫలితాలతో టెక్‌ మహీంద్రా  6.5 శాతానికిపైగా లాభపడింది టాటా మోటార్స్, టాటా స్టీల్‌, బజాజ్‌ ఆటో షేర్లు గ్రీన్ గా, ఐసీఐసీఐ, ఇన్ఫ్రాటెల్‌, ఏషియన్‌ పెయింట్స్‌, పవర్‌గ్రిడ్‌, అంబుజా  రెడ్ గా ట్రేడవుతున్నాయి.అటు డాలర్ మారకపు విలువలో రూపాయి  స్వల్ప నష్టంతో కొనసాగుతోంది. ఎంసీఎక్స్ మార్కెట్ లో  పసిడి25 రూపాయల లాభంతో 10 గ్రా.లు 29952 వద్ద ఉంది.