లారీల బంద్‌

న్యూఢిల్లీ : ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి ప్రైవేటు వారీలు, బస్సుల నిరవదిక బంద్‌ యోచనను విమమించకున్నట్లు అఖిల మోటర్‌ రవాణా కాంగ్రెస్‌ (ఏఐఎంటీసీ) తెలిపింది. డీజిల్‌ ధరలు పెంపు, థర్డ్‌ పార్టీ ఇన్సూరెన్సు ప్రీమియం ధరల పెంపును వ్యతిరేకిస్తూ ఈ బంద్‌ చేయాలని తొలుత నిర్ణయించారు. దీంతో దేశంలో 75 లక్షల ట్రక్కులు, 40లక్షల బస్సులు యధావిధిగా తిరగనున్నాయి. ఏఐఎంటీసీ నేతలతో కేంద్ర జాతీయ రహదారులు, రవాణ మంత్రిత్వ శాఖ చర్చలు జరిపి వారి డిమాండ్లను పరిష్కరిస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. దీంతో బంద్‌ యోచన విరమిస్తున్నట్లు ఏఐఎంటీసీ అధ్యక్షడు మల్‌కిత్‌సింగ్‌ తెలిపారు.