లారీ ఢీకొని డిగ్రీ విద్యార్థి దుర్మరణం

బోయపల్లి: రోడ్డు ప్రమాదంలో డిగ్రీ విద్యార్థి మృతి చెందిన సంఘటన నెల్లూరు జిల్లా సంగవరం వద్ద మంగళవారం ఉదయం జరిగింది. గుడి శివానందం అనే విద్యార్థి డిగ్రీ చదువుతున్నాడు. మంగళవారం ఉదయం బైక్‌పై వెళుతుంగా నాయుడుపేట రోడ్డు సంగవరం వద్ద లారీ ఢీ కొట్టింది.దీంతో అతను అక్కడిక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.