లారీ-బస్సు ఢీ: 10 మంది మృతి

: నల్గొండ జిల్లా రామన్నపేట మండలం తుమ్మలగూడెం వద్ద బుధవారం మధ్యాహ్నం ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. భువనగిరి నుంచి నల్గొండ వెళ్తున్న నార్కట్‌పల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు తుమ్మలపాలెం సమీపంలో మూల మలుపు వద్ద ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10 మందికి పైగా ప్రయాణికులు మృతిచెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు అక్కడికి చేరుకుని సహాయచర్యలు చేపడుతున్నారు.