లి0బ ప్రాథమిక పాఠశాలలను సందర్శించిన బండి…

 శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన బండి.
 భైంసా రూరల్ డిసెంబర్    01    జనం సాక్షి
ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా నాలుగో రోజు నిర్మల్ జిల్లా కుంటాల మండలం లింబ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను సందర్శించి,కాసేపు విద్యార్థులతో ముచ్చటించారు. సమస్యలను పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.పాఠశాలలో శిథిలావస్థకు చేరుకున్న భవనాలను పరిశీలించి,ఉపాధ్యాయుల కొరతపై ఆరా తీశారు. అనంతరం బండి మాట్లాడుతూ…ప్రైవేటు స్కూల్లకు ధీటుగా.. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని,శిథిలావస్థకు చేరుకున్న భవనాల స్థానంలో కొత్త బిల్డింగ్ లను కట్టడంలోనూ కేసీఆర్ సర్కార్ విఫలం అంటూ ఫైర్ అయ్యారు.బిజెపి ప్రభుత్వం వచ్చాక, పాఠశాలలకు మహర్దశ తీసుకొస్తామని హామీ ఇచ్చారు.సిపిఎస్ రద్దు చేయాలంటూ ఉపాద్యాయులు బండి సంజయ్ కి వినతి పత్రం అందించారు. గ్రామంలోని శివాజీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. కెసిఆర్ అంటేనే కాసిం చంద్రశేఖర్ రజ్వి అని గ్రామస్తులతో అన్నాడు. లింబ గ్రామంలో ఇప్పటికి డబుల్ బెడ్రూంలో దాఖలాలు లేవని, ప్రశ్నించే గొంతుకులను నొక్కిస్తున్నాడని, నిన్న బాసర ట్రిపుల్ ఐటిలో 80 విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అని విని బాధపడ్డానని అన్నారు.