లీక్వాన్ యూనివర్సిటీతో ఎపి ఒప్పందం
సింగపూర్,జూలై9(జనం సాక్షి): పాలనలో పోటీతత్వం పెంచేలా పరిశోధన, శిక్షణ ఇతర అంశాల్లో ఏపీకి పరస్పర సహకారం అందించేందుకు సింగపూర్‌కు చెందిన ఎల్‌కేవై స్కూల్ ఆఫ పబ్లిక్ పాలసీ ముందుకొచ్చింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదిరింది. లీ క్వాన్ యూనివర్శిటీలో జరిగిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునీఠా, ప్రొఫెసర్ డానీ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ‘వియత్నాం, సింగపూర్ మధ్య పారిశ్రామిక పోటీతత్వం’ పుస్తకాన్ని చంద్రబాబుఆవిష్కరించారు.