లైనులో నిలబడ్డ రాహుల్..!!

rahulgandhi-759ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం బడా పారిశ్రామికవేత్తలు, ధనవంతుల కోసం పని చేస్తోందని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. రాహుల్ గాంధీ శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో పార్లమెంటు వీధిలోని ఎస్‌బిఐ శాఖకు వెళ్లి నాలుగు వేల పాత నోట్లను కొత్త నోట్లుగా మార్చుకునేందుకు క్యూలో నిలబడి సంచలనం సృష్టించారు. ఆయన పార్లమెంటు వీధిలో పోలీసు స్టేషన్ పక్కన ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖకు వచ్చి నోట్లు మార్చుకునేందుకు లైనులో నిలబడటంతో గందరగోళం నెలకొన్నది. బ్యాంకులో అప్పటికే వందలాదిమంది లైన్లలో ఉన్నారు. రాహుల్ వెళ్లి లైనులో నిలబడగానే భద్రతా సిబ్బంది అక్కడికి వచ్చి ఆయనను లోపలికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే ఆయన మాత్రం లోపలికి వెళ్లేందుకు నిరాకరించారు. అందరి మాదిరిగానే తానుకూడా డి డబ్బు మార్చుకుంటానని భద్రతా సిబ్బందికి స్పష్టం చేశారు. రాహుల్ వెంట వచ్చిన లోక్‌సభ సభ్యురాలు సుస్మితా దేవ్, మరో ఎంపికూడా లైనులో నిలబడ్డారు.