లోకేశ్‌ ముఖ్యమంత్రి అయితే తప్పేంటి?

– జగన్‌ అధికారంలోకి వస్తే ఏపీకీ భవిష్యత్తు ఉండదు
– మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే టీడీపీని గెలిపించాలి
– కియాను పోరాడి చంద్రబాబు ఏపీకి తెప్పించాడు
– బీజేపీతో కాపురం వద్దని బాబుకెప్పుడో చెప్పా
– ఏపీ అభివృద్ధి కావాలంటే తప్పదని అన్నారు
– బీజేపీ మోసాన్ని గుర్తించేందుకే నాలుగేళ్లు పట్టింది
– మోదీ, జగన్‌ మధ్య ఒప్పందం కుదిరింది
– జగన్‌కు 1500 కోట్లు వస్తున్నాయి
– మహానాడులో ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
విజయవాడ, మే29(జ‌నం సాక్షి) : ఏపీకి కేంద్రం తీవ్ర అన్యాయం చేసిందని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి మండిపడ్డారు. మహానాడు వేదికగా ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ఆవేశంగా ప్రసంగించారు.. లోకేశ్‌ ముఖ్యమంత్రి అయితే తప్పేంటి? అని ప్రశ్నించారు. అలాగే చంద్రబాబు ప్రధానమంత్రి పదవి ఎందుకు వద్దంటున్నారో తనకు తెలియడం లేదన్నారు. చంద్రబాబు కచ్చితంగా ప్రధానమంత్రి కావాలని కోరారు. విభజన తర్వాత రాష్ట్రం కోసం చంద్రబాబు ఎంతో కష్టపడ్డారన్నారు. పోలవరంపై అవినీతి జరిగిందంటే కాంగ్రెస్‌ హయాంలోనే జరిగిందన్నారు. ముడుపులు అందాయంటే జగన్‌కే ముట్టాయని చెప్పారు. మోదీ ప్రధానిగా ఉన్నంతకాలం ఏపీకి ప్రత్యేక ¬దా రాదని చెప్పారు. బీజేపీతో కాపురం వద్దని చంద్రబాబుకు ఎప్పుడో చెప్పానన్నారు. ప్రత్యేక ¬దా రాదని నాలుగేళ్ల క్రితమే తెలియజేశానన్నారు. ¬దా బదులు ప్యాకేజీ ఇస్తానంటే దానికి చంద్రబాబు బోల్తా పడ్డారని జేసీ చమత్కరించారు. జగన్‌ వస్తే భవిష్‌త్తు ఉండదని జేసీ అన్నారు. చంద్రబాబు పక్కన ఎవరున్నారో.. జగన్‌ పక్కన ఎవరున్నారో చూడండి.. జగన్‌ పక్కన పీకలు కోసే మంగళి కృష్ణ లాంటివారు ఉంటారన్నారు. చంద్రబాబు సీనియర్‌ నాయకుడైనా మంచికి చెప్పే మాటలు వింటారని, జగన్‌ అసలు మాట కూడా వినను కూడా వినరన్నారు. చంద్రబాబు మూల విరాట్టు అయితే మంత్రులు, ఎమ్మెల్యేలు రమణ దీక్షితుల్లా తయారయ్యారని జేసీ అన్నారు. వాస్తవాలు విూ వరకు చేరడం లేదు.. తప్పు చేసినవారిని దండించండి. నేను మిమ్మల్ని విమర్శిస్తున్నానని అనుకోవద్దు.. నాకు ఎలాంటా దుర్భద్దీ లేదు అని చంద్రబాబుకు జేసీ సూచించారు. మోదీ, జగన్‌ మధ్య ఒప్పందం కుదిరింది.. జగన్‌కు రూ. 1500 కోట్లు వస్తున్నాయి. జగన్‌ వద్ద రాజారెడ్డి క్రూరత్వం ఉందన్నారు. టికెట్‌ ఇస్తాం వైసీపీలోకి రావాలని జగన్‌ తనను కోరాడని.. పార్టీలోకి వస్తే ఎన్ని డబ్బులు ఇస్తావని విజయసాయి రెడ్డి అడిగారన్నారు. విూకు ఎందుకు కప్పం చెల్లించాలని అడిగానని, జగన్‌ దగ్గర ఊడిగం చేయలేక వైసీపీలోకి వెళ్లలేదని జేసీ తెలిపారు. వైఎస్‌ మంత్రి కావటం కోసం రాజారెడ్డి అకృత్యాలకు పాల్పడ్డారని అన్నారు. స్కెచ్‌ వైఎస్‌ వేస్తే.. రాజారెడ్డి అమలు చేసేవారని అన్నారు. వీరు చేసే అకృత్యాలకు రెడ్లు అంటేనే ప్రజలు చీదరించుకొనే పరిస్థితి వచ్చిందన్నారు. అనంతపురంలో రైతులు ఎకరాకు లక్ష రూపాయలు సంపాదిస్తున్నారు. కియా వచ్చాక అనంత జిల్లా రూపురేఖలు మారాయన్నారు. చంద్రబాబు హార్టికల్చర్‌ను అభివృద్ధి చేయడం వల్లే మా ఊరికి కార్లు వచ్చాయి. చంద్రబాబు కోసం కాదు విూ కోసం.. విూ పిల్లల కోసం టీడీపీకి ఓటు వేయండి. ప్రతి ఎకరాకు నీళ్లు రావాలి.. ఏపీ సౌభాగ్యంగా ఉండాలి.. యాచకులుగా ఉండొద్దని చంద్రబాబు ఆశపడతారన్నారు. కేంద్రం, రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు కలిసి ఆడుతున్న ఆటలను ప్రజలు
తెలుసుకోవాలని జేసీ విజ్ఞప్తి చేశారు.