లోతట్టు ప్రాంతాలను సందర్శించిన ఐటిడిఏ,పీఓ.అంకిత్
ఏటూరునాగారం(జనం సాక్షి).జులై19.
మండల పరిధిలోని లోతట్టు ప్రాంతాలను సందర్శించిన ప్రాజెక్ట్ ఆఫీసర్ ఏటూరునాగారం అంకిత్,
జీడివాగు లోతట్టు ప్రాంతాన్ని సందర్శించి వాగులో నీటి మట్టాన్ని పరిశీలించి క్షేత్రస్థాయి సిబ్బందిని నియమించి పరిస్థితిని పర్యవేక్షించాలని తహశీల్దార్‌ను ఫోన్‌లో ఆదేశించారు.
షాపల్లి గ్రామంలోని వట్టివాగు బ్రిడ్జిని తహశీల్దార్ మరియు సిబ్బందితో కలిసి సందర్శించి వంతెనకు అనుసంధానంగా ఉన్న రోడ్డు నిర్మాణాన్ని పరిశీలించి తహశీల్దార్ మండలంలోని గ్రామల్లో పర్యటించి పరిస్థితులను పర్యవేక్షించి పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలియజేయలన్నారు.
అలాగే ఐటిడిఎ యూనిట్ అధికారులు కేటాయించిన మండలాలను సందర్శించి, పరిస్థితులను పర్యవేక్షించాలని, ఏదైనా అత్యవసరమైతే సహాయం కోసం సంబంధిత తహశీల్దార్లు మరియు ఎంపిడిఓలతో సమన్వయం చేసి ప్రాజెక్ట్ అధికారి ఐటిడిఎకు నివేదించాలని ఆదేశించారు.