లోయర్ ట్యాంక్ బండ్ వద్ద కవిత అరెస్టు
హైదరాబాద్ : అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవితతోపాటు, పలువురు తెరాస నేతలు, కార్యకర్తలను పోలీసులు లోయర్ ట్యాంక్ బండ్ వద్ద అరెస్టు చేశారు. ఈసందర్భంగా కవిత మాట్లాడుతూ…. శాంతియుతంగా అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన తమను అడ్డుకోవడం దారుణమని వ్యాఖ్యానించారు. తెరాస కార్యకర్తలు సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.