వంట గ్యాస్ సిలిండర్ ధర పెంచిన కేంద్రం
` బండపై రూ.50 చొప్పున పెంపు
` తీవ్రంగా మండిపడ్డ విపక్షాలు
న్యూల్లీ(జనంసాక్షి): దేశ వ్యాప్తంగా వంట గ్యాస్ సిలిండర్ ధరలను కేంద్రం పెంచింది. గృహావసరాలకు వినియోగించే 14.2 కిలోల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ పై రూ.50 చొప్పున పెంచుతున్నట్లు కేంద్ర పెట్రోలియం, సహాయ వాయువుల శాఖమంత్రి హర్దీప్‌సింగ్ పురీ వెల్లడిరచారు. ఈ ధరల పెంపు ఉజ్వల పథకం లబ్ధిదారులకు సైతం వర్తింపజేస్తున్నట్లు తెలిపారు. తాజా పెంపుతో సాధారణ వినియోగదారులు, ఉజ్వల పథకం లబ్ధిదారులు ఇప్పుడు ఒక్కో సిలిండర్‌పై చెల్లిస్తున్న దానిపై అదనంగా రూ.50 చెల్లించాల్సి ఉంటుంది.గత వారంలో హోటళ్లు, రెస్టారంట్లు సహా వాణిజ్య అవసరాల కోసం వినియోగించే వాణిజ్య సిలిండర్ గ్యాస్ ధరను రూ.41 మేర తగ్గించిన విషయం తెలిసిందే. రాష్ట్రాలను బట్టి ఈ తగ్గింపులో మార్పు ఉంటుంది.ఈ తరుణంలోనే సోమవారం మధ్యాహ్నం పెట్రోల్, డీజిల్‌పై రూ.2 చొప్పున ఎక్సైజ్ డ్యూటీని కేంద్రం పెంచింది. ఈ పెంపుతో వినియోగదారులపై ప్రభావం పడబోదని స్పష్టం చేసింది. ఈ భారాన్ని చమురు మార్కెటింగ్ కంపెనీలే భరిస్తాయని పేర్కొంది. పెరిగిన ధరలు ఏప్రిల్ 8 నుంచి అమలులోకి వస్తాయని కేంద్రం నోటిఫికేషన్‌లో పేర్కొంది.
వంట గ్యాస్ సిలిండర్ ధరల్ని పెంచడంపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఈ మేరకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ‘ఎక్స్’ వేదికగా పోస్టు పెట్టారు. ‘‘మోదీ జీ.. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు ఒక్కటే మిగిలాయా? ఈసారి ద్రవ్యోల్బణం కొరడా దెబ్బ ‘ఉజ్వల’ పేద మహిళల పొదుపు పైనాపడిరది. దోపిడీ, మోసం అనే పదాలకు మోదీ ప్రభుత్వం పర్యాయ పదంగా మారింది’’ అని ఖర్గే మండిపడ్డారు.