వంతెనపై నుంచి పడ్డ లారీ.. క్లీనర్ మృతి

సిద్ధిపేట(మెదక్ జిల్లా): మెదక్‌ జిల్లాలోని సిద్ధిపేట మండల శివారులో హరిహర రెసిడెన్సీ వద్ద నున్న వంతెన పై నుంచి గురువారం ఓ ఇటుక లారీ అదుపు తప్పి కిందపడింది. ఈ ఘటనలో క్లీనర్ అక్కడికక్కడే మృతిచెందగా.. డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం డ్రైవర్‌ను హైదరాబాద్ తరలించారు.

కరీంనగర్ జిల్లా పెద్దపల్లి నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.71472100727_625x300