వందేళ్ల కస్పా హైస్కూల్…
– సౌకర్యాల కొరతపై లోక్‌సత్తా నిరసన
విజయనగరం, జూలై 11 : పట్టణంలోని వందేళ్లు పూర్తి చేసుకుంటున్న కస్పా హైస్కూల్‌లో కనీస సౌకర్యాలు లేకపోవడంతో లోక్‌సత్తా పార్టీ బుధవారం నిరసన తెలిపింది. ఈ మేరకు పార్టీ జిల్లా కన్వీనర్ భీశెట్టి బాబ్జీ, మహిళా విభాగ కన్వీనర్ అనంత లక్ష్మితో కూడిన బృందం పాఠశాలను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఓ వైపు పాఠశాల వారోత్సవాలు నిర్వహిస్తూ ఈ చరిత్ర కలిగిన స్కూల్ గురించి పట్టించుకోకపోవడంతో దారుణమన్నారు. అంతేగాక ఇప్పటికీ ఇక్కడ మౌలిక సదుపాయాలు లేక బాలబాలికలు చెట్ల కిందే చదువుతున్నారని విమర్శించారు. ఈ పరిస్థితులపై ఓ నివేదికను రూపొందించి కలెక్టర్‌కు అందజేస్తామని చెప్పారు.