వంద పడకల ఆసుపత్రిలో వైద్యులు వైద్య పరికరాలు ఏర్పాటు చేయాలి: బి అయోధ్య
పినపాక నియోజకవర్గం సెప్టెంబర్ 20 (జనం సాక్షి):మణుగూరు వంద పడకల ఆసుపత్రి వైద్యుల నియమించాలని , సమస్యలు పరిష్కరించాలని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ దృష్టికి తీసుకెళ్లిన సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొల్లోజు అయోధ్య చారి i అనంతరం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పినపాక నియోజకవర్గ కేంద్రమైనటువంటి మణుగూరు వంద పడకల ఆసుపత్రిలో వైద్యులను, సిబ్బందిని, ఏర్పాటు చేయాలని ఆస్పత్రికి సంబంధించిన వైద్య మెటీరియల్ (పరికరాలను) వెంటనే అందించాలని రాష్ట్ర మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ రంజిత్ రెడ్డి ,రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ హెల్త్ గడల శ్రీనివాసరావు ను సోమవారం హైదరాబాదులో వీరిని కలిసి మణుగూరు వంద పడకల ఆసుపత్రి సమస్యలపై, పినపాక నియోజకవర్గం లో హెడ్ క్వార్టర్ గా ఉన్నటువంటి మణుగూరులో వంద పడకల ఆసుపత్రి వైద్యులు నియమించాలని ఈ ప్రాంతంలో గిరిజన ఎస్సీ ఎస్టీ పేద మధ్యతరగతి ప్రజలు జీవిస్తున్నారని ,వీరికి ఏదైనా అనారోగ్యం వస్తే వేలాది రూపాయలు ఖర్చు చేసి ప్రైవేట్ లో వైద్యం చేయించుకునే స్థోమత లేక అనేక మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, వీరి వైద్యం కోసం ప్రభుత్వం వంద పడకల ఆసుపత్రి నిర్మించినప్పటికీ దానిలో కనీసం వైద్యులు వైద్య పరికరాలు సిబ్బంది సౌకర్యాలు లేవని వెంటనే వాటిని ప్రభుత్వం మంజూరు చేయాలని ,ప్రజలు ఆరోగ్యం కోసం పడుతున్న ఇబ్బందుల గురించి వారికి వివరించారు .మణుగూరులో 30 పడకల ఆసుపత్రి గా ఉన్నటువంటి ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా, మార్చాలని సిపిఐ అనేక పోరాటాలు నిర్వహించింది. 30 పడకలుగా ఉన్నటువంటి ఆసుపత్రిని 100 పడకలుగా అప్క్రీడ్ చేసి 2017 సంవత్సరంలో వైద్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి డాక్టర్ లక్ష్మారెడ్డి వంద పడక ఆసుపత్రిగా ప్రారంభించారు. కానీ ఆస్పత్రిలో వైద్యులు సిబ్బంది లేక, ఎక్స్ రే, రక్తపరీక్ష కేంద్రాలు అందుబాటులో లేకపోవడంతో ప్రైవేట్ ఆస్పత్రి ఆశ్రయించాల్సి వస్తుంది. ఆసుపత్రి ఆస్పత్రి ప్రారంభించి వైద్యులు వైద్య పరికరాలు లేక నిరుపేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయమై అనేకసార్లు పలు దాపాలుగా ఆందోళన నిర్వహించాము.
మణుగూరు కేంద్రంగా అశ్వాపురం ,పినపాక కరకగూడెం ,సుదుర ప్రాంతాల ఎవరైనా మరణిస్తే బూర్గంపాడు లేక భద్రాచలం పోస్టుమార్టానికి తరలించే పరిస్థితి ఉందని, సుమారు 70 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు దూరం ఉండేదని, మణుగూరులో కేంద్రంగా పోస్టుమార్టం ఏర్పాటు చేయాలని, వంద పడకల ఆసుపత్రిలో వైద్యులను, సిబ్బందిని పరికరాలను వెంటనే ఏర్పాటు చేయాలని, ముఖ్యమంత్రి పర్సనల్ సెక్రెటరీ స్మిత అగర్వాల్ ,రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ వాకాటి అరుణ, డైరెక్టర్ దివ్య ,మణుగూరు వచ్చిన సందర్భంగా వారికి వినతి పత్రం అందజేసి ఆస్పత్రి విషయాలు గురించి వారికి వివరించగా వెంటనే స్పందించారు ఆసుపత్రి సంబంధించిన వివరాలను తెలుసుకొని దీనిని వంద పడకల ఆసుపత్రిగా అప్ గ్రేడ్ చేశారు.
19 -11 -2021న రాష్ట్ర వైద్య శాఖ మంత్రి హరీష్ రావు దృష్టికి మణుగూరు వంద పడకల ఆసుపత్రి సమస్యలను వివరించడంతో వెంటనే సమస్య పరిష్కారిస్తానని ఆనాడు వారు ఆ హామీ ఇచ్చారు.మణుగూరు 100 పడకల ఆసుపత్రి పై ఆగస్టు 15 2022న ఆరోగ్యశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్లకి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగిం ది.స్పత్రిలో సమస్యలు పరిష్కరించాలని 19-9 -2022_న సోమవారం హైదరాబాదులోని రాష్ట్ర వైద్య విధాన పరిషత్ మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ రంజిత్ రెడ్డి, వైద్య విధాన పరిషత్ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ గడల శ్రీనివాసరావును కలిసి వినతి పత్రం ఇచ్చి సమస్యలను వివరించాము .వెంటనే స్పందించి సమస్యను పరిష్కరిస్తామని వారు హామీ ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బుల్లోడు అయోధ్య చార సిపిఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు.