వంద రైల్వే స్టేషన్లకు వై-ఫై: సుందర్ పిచాయ్
హైదరాబాద్ : హైదరాబాద్‌లో గూగుల్ నూతన ప్రాంగణం ఏర్పాటు చేస్తామని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ప్రకటించారు. దేశ అవసరాల దృష్ట్యా కొత్త ఉత్పత్తుల కోసం నూతన ప్రాంగణం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. భారత్‌లోని 100 రైల్వే స్టేషన్లలో వైఫై సౌకర్యం కల్పిస్తామని ఉద్ఘాటించారు. వచ్చే డిసెంబర్ లోగా రైల్‌టెల్ సహకారంతో వైఫై సదుపాయం అందుబాటులోకి వస్తుందన్నారు.
1) భారతదేశంలోని వంద రైల్వే స్టేషన్లలో రైల్‌టెల్ సహకారంతో 2016 డిసెంబర్ నాటికల్లా వై-ఫై సేవలు
2) మూడేళ్లలో భారతదేశంలోని 3 లక్షల గ్రామాల్లో మహిళలకు ఇంటర్‌నెట్ సదుపాయం కల్పించేందుకు గూగుల్ సాయం
3) భారతదేశం కోసం ఉత్పత్తులు తయారుచేసేందుకు హైదరాబాద్‌లో ‘ఇంజనీరింగ్ ప్రెజెన్స్’ను పెంచడం
4) 11 భాషల్లో టైప్ చేసేందుకు ఉపయోగపడే గూగుల్ ‘ఇండిక్’ కీబోర్డు
5) 2016 నుంచి గూగుల్ సెర్చ్ ద్వారా లైవ్ క్రికెట్ అప్‌డేట్లు