వంశధార ట్రైబ్యునల్‌లో మొదటిరోజు వాదనలు

న్యూఢిల్లీ : వంశధార ట్రైబ్యునల్‌లో మొదటిరోజు వాదనలు ముగిశాయి. ఈ వాదనలు రేపు కూడా కొనసాగుతాయి. వంశధారలో 25 టీఎంసీలకు మించి ప్రస్తుతం వాడుకునేందుకు అవకాశం లేదని ఆంధ్రప్రదేశ్‌ ట్రైబ్యునల్‌కు తెలిపింది. మొత్తం 115 టీఎంసీల్లో ఒడిశా 8 టీఎంసీలే వాడుకుంటుందని ఆంధ్రప్రదేశ్‌ పేర్కొంది. 60 నుంచి 70 టీఎంసీల నీరు వృథాగా సముద్రంలోని పోతోందని, వృథాగా పోతున్న నీటిని వాడుకోవాల్సిన అవసరం ఉందని ఆంధ్రద్రేశ్‌ పేర్కొంది. జాతి అవసరాల దృష్ట్యా నీటి వినియోగాన్ని పెంచుకోవాలని స్పష్టం చేసింది. రాజకీయ కారణాలతోనే ఆంధ్రప్రదేశ్‌ ప్రజెక్టుల నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్‌ ఆరోపించింది.1962 నాటి ముఖ్యమంత్రుల ఒప్పందం ప్రకారమే నేరడి ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోందని ట్రైబ్యునల్‌కు తెలిపింది.