వజ్రోత్సవాల్లో భాగంగా  మహిళలకు ముగ్గుల పోటీలు

రుద్రంగి ఆగస్టు 20 (జనం సాక్షి)
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 75 వ స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా గ్రామ పంచాయతీ మరియు ఐకెపి ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు.దేశ భక్తిని చాటే విదంగా రంగవళ్ళులతో మహిళలు వేసిన ముగ్గులు చూపరులను అలరించాయి.ఇట్టి ముగ్గుల పోటీల్లో గెలుపొందిన మహిళలకు జడ్పిటీసీ గట్ల మినయ్య
,సర్పంచ్ తర్రె ప్రభాలత మనోహర్,చేతుల మీదుగా బహుమతులను అలాగే చీరలను అందజేశారు.
ప్రతి ఒక్కరు దేశ భక్తిని చాటే విదంగా స్వతంత్ర వజ్రోత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడం గర్వకారణమని అన్నారు.మహిళలు వంటింటికే పరిమితం కాకుండా ఇలాంటి పోటీల్లో పాల్గొని ప్రతిభను చాటాలని కోరారు.ఈ కార్యక్రమంలో
ఐకెపి ఏపీఎం రాజు,నాయకులు కోడగంటి శ్యామ్,
ఆకుల గంగారాం,బండరీ నర్సయ్య,గొళ్ళెం నర్సింగ్,ఐకెపి సిబ్బంది మహిళ సంఘాల ప్రతినిధులు,అంగన్వాడీ టీచర్లు,హెడ్ మాస్టర్ అంబటి శంకర్,తదితరులు పాల్గొన్నారు.