వజ్రోత్సవాల సందర్బంగా మండల, గ్రామ స్థాయిలో ర్యాలీలు
జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
యాదాద్రి భువనగిరి బ్యూరో. జనం సాక్షి
స్వాతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా ఈ నెల 13వ తేదీన జిల్లా కేంద్రంలో ,మండల గ్రామ స్థాయిలలో ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఒక ప్రకాటంలో తెలిపారు.
కార్యక్రమంలో బాగంగా 13 వ తేదీన పాఠశాల విధ్యార్ధులు, ఎన్ సీ సీ. ఎన్ ఎస్ ఎస్ , స్కౌట్స్ & గైడ్స్ , ఉద్యోగస్తులతో ర్యాలీలు నిర్వహించేందుకు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేసిన్నట్లు , జిల్లా కేంద్రంలో ఈ ర్యాలీ భువనగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి ప్రారంభిస్తున్నట్లు , ర్యాలీలో ప్రతి ఒక్కరూ బాగస్వాములు కావాలని, ఈ కార్యక్రమాన్ని , డీఈఓ , సంబందిత తహసిల్ధార్లు, ఎంపిడిఓ లు, మున్సిపాలిటీ పరిధిలో మున్సిపాల్ కమీషనర్లు, డిగ్రీ కాలేజీలకు ప్రిన్సిపల్స్ బాద్యతలు నిర్వహిస్తారని ఆమె తెలిపారు.
14వ తేదీన జానపధ కళాకారుల ప్రదర్శనలో బాగంగా భువనగిరి నియోజకవర్గం కేంద్రంలోని ప్రిన్స్ కార్నర్, అపోసిట్ రైతు బజార్ వద్ద ఉదయం 11.00 గంటల నుండి మధ్యాహ్నం 01.00 వరకు ప్రదర్శన నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమం స్థానిక మున్సిపల్ కమీషనర్ ఆధ్వర్యంలో జరుగుతుందని , అదే రోజు ఆలేరు నియోయకవర్గ కేంద్రంలోని ఎస్ బి ఐ బ్యాంకు దగ్గర , అంబేద్కర్ విగ్రహం పక్కన ఉదయం 11.00 గంటల నుండి 01.00 గంటల వరకు ప్రదర్శన ఉంటుందని , ఈ కార్యక్రమo ఆలేరు మున్సిపల్ కమీషనర్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.అదే రోజు సాయంత్రం జిల్లా హెడ్ క్వార్టర్ (భువనగిరి ప్రభుత్వ జూనియర్ కాలేజీ ) లో బాణ సంచా కాల్చే కార్యక్రమం ఉంటుందని కలెక్టర్ తెలిపారు .