వజ్రోత్సవ ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్ నిఖిల
వికారాబాద్ జిల్లా బ్యూరో జనం సాక్షి , ఆగస్టు 13 :
75 ఏళ్ల స్వతంత్ర భారత వజ్రోత్సవంలో భాగంగా వికారాబాద్ పట్టణంలోని ఎమ్మార్పీ చౌరస్తా నుండి బ్లాక్ గ్రౌండ్ వరకు నిర్వహించిన ఫ్రీడమ్ ర్యాలీని జిల్లా కలెక్టర్ నిఖిల జెండా ఊపి ప్రారంభించారు. ఫ్రీడమ్ ర్యాలీలో ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, జిల్లా ఎస్పీ కోటిరెడ్డి, వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ లతో పాటు జిల్లా అధికారులు, పోలీస్ సిబ్బంది విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ పాఠశాలల విద్యార్థులు జాతీయ జెండాలతో ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు. డివైఎస్ఒ హనుమంతరావు, డిటిడబ్ల్యూఒ కోటాజీ, ఎస్సీ కార్పొరేషన్ అధికారి మల్లేశం, బీసీ వెల్ఫేర్ అధికారి ఉపేందర్, జిల్లా విద్యాధికారి రేణుకా దేవి, మైనార్టీ వెల్ఫేర్ అధికారి సుధారాణి డిడబ్ల్యూఒ కె.లలిత కుమారి, మున్సిపల్ కమిషనర్ శరత్ చంద్ర తదితరులు పాల్గొన్నారు.
