వడ్లు కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

అందుబాటులో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు*
*ఐకెపి కేంద్రాలు -10 పి ఎ సి ఎస్ కేంద్రాలు -7*
*ఎంపీపీ సంధ్య , జడ్పిటిసి భార్గవి*
*గోపాల్ పేట్ జనం సాక్షి నవంబర్ (11):* రైతుల పండించిన వరి ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు రైతుల సౌకర్యార్థం ప్రభుత్వం అందుబాటులో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎంపీపీ సంధ్య జెడ్పిటిసి మంద భార్గవి అన్నారు శుక్రవారం వారు మండల కేంద్రంతో పాటు జయన్న తిరుమలాపూర్, మున్ననూరు, పాటిగడ్డ తండా, బుద్ధారం, లక్ష్మీ తండా, కర్ణమయ్యకుంట తండ, ఆముదాల కుంట తండ, చెన్నూరు,పోలికే పహాడ్ చాకలి పల్లి ఏదుట్ల ఏదుల అనంతపురం గ్రామాల్లో ఐకెపి సింగల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు . ఈ సందర్భంగా అడిషనల్ డిఆర్డిఏ రేణుక మాట్లాడుతూ ఏ గ్రేడ్ వరి ధాన్యాన్ని క్వింటాళ్లు రూ 2060, బి గ్రేడ్ 2040 చొప్పున కొనుగోలు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ధాన్యం 14 శాతం తేమ ఉండే విధంగా ఆరబెట్టాలని సూచించారు ధాన్యం విక్రయ డబ్బులు నేరుగా రైతుల ఖాతాల్లో జమ కానున్నట్లు ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో డీపీఎం భాషనాయక్ ,ఏపీఎం సావిత్రి, డిసిఎంఎస్ వైస్ చైర్మన్ హర్య నాయక్, వైస్ ఎంపీపీ చంద్రశేఖర్,  సింగిల్ విండో చైర్మన్ లోడె రఘు యాదవ్, వైస్ చైర్మన్ గువ్వల రాములు, రైతుబంధు అధ్యక్షులు అడ్డాకుల తిరుపతి యాదవ్, కో ఆప్షన్ మతిన్, టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు గాజుల కోదండం, మంద కోటేశ్వర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు