వద్దన్నా పరీక్ష రాసిందని.. దళిత యువతిపై కిరోసిన్ పోసి నిప్పంటించారు

లక్నో: తాము వద్దన్నా పరీక్ష రాసిందన్న అక్కసుతో ఓ దళిత యువతి(17)పై కిరోసిన్ పోసి నిప్పంటించారు నలుగురు దుర్మార్గులు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఖుషీనగర్ జిల్లా పత్తార్ దెవా గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న ఇంటర్ పరీక్షలకు బాధితురాలు హాజరైందన్న కోపంతో నిందితులు ధీరజ్ యాదవ్, అతడి సోదరులు అర్వింద్, దినేష్, వారి తండ్రి రాంపర్వేష్ యాదవ్‌ ఘాతుకానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ఇంట్లో వంట చేస్తున్న యువతిని బయటకు ఈడ్చుకొచ్చిన నిందితులు, ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించారని చెప్పారు. కాగా, 70 శాతం కాలిన గాయాలతో బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.\ వద్దన్నా పరీక్ష రాసిందని.. దళిత యువతిపై కిరోసిన్ పోసి నిప్ప తాను చదువుకొనసాగించడం నిందితులకు ఇష్టం లేదని బాధితురాలు తెలిపింది. స్కూల్‌లో నిర్వహించే ప్రతీ పరీక్షలో వారు ఫెయిలయ్యారని.. అందుకే తన చదువును అడ్డుకోవాలని చూశారని చెప్పింది. కొన్ని నెలల క్రితం ధీరజ్ తన ఫోటో తీసి బ్లాక్ మెయిల్ చేసేందుకు ప్రయత్నించాడని, ఈ సందర్భంగా తమ రెండు కుటుంబాల మధ్య పెద్ద గొడవ జరిగిందని వెల్లడించింది. ధీరజ్ తనపైనా కూడా దాడి చేశాడని బాధితురాలి సోదరుడు తెలిపాడు. కాగా, నిందితులపై వేధింపుల కేసు నమోదు చేశామని, పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని రాంకోల స్టేషన్ హౌజ్ ఆఫీసర్ పికె త్రిపాఠి తెలిపారు. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు.