వనపర్తికి తలమానికం తిరుమలయ్య గుట్ట

 

రాష్ట్రంలోనే అటవీప్రాంతం  పక్కన ఉన్న అరుదైన పట్టణం

ఒకటి రెండు పట్టణాలకు మినహా రాష్ట్రంలోని మరే పట్టణానికి ఇలాంటి పర్యావరణ హితమైన వాతావరణం లేదు

అరుదైన వనమూలికలకు తిరుమలయ్య గుట్ట అటవీప్రాంతం ప్రసిద్ది

ఈ ప్రాంతంలో మరింత పెద్ద ఎత్తున మొక్కలను పెంచి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం

తిరుమలయ్య గుట్ట చుట్టూ సుందరీకరణ

గుట్ట పైకి వెళ్లేందుకు రహదారి వెంట మెట్ల ఏర్పాటు

వాహనాలకు ఇబ్బందిలేకుండా, పాదాచారులకు ప్రమాదాలు జరగకుండా చర్యలు

గుట్ట మీదికి నీటిసౌకర్యం కల్పిస్తాం

వాహనాల పార్కింగ్ కు శాశ్వత ఏర్పాట్లు

అన్ని రంగాలలో ప్రణాళికాబద్దంగా అభివృద్ది

అన్నివర్గాల సంక్షేమమే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష

దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా సంక్షేమ పథకాలు

ధరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి సహాయనిధి నుండి సాయం

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతుబంధు, రైతుభీమా, కేసీఆర్ కిట్ అమ్మవడి, ఆసరా ఫించన్లు ఒక్క తెలంగాణలోనే విజయవంతంగా అమలు చేస్తుండం తెలంగాణ ప్రభుత్వ ఘనత

ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా, కేంద్ర ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా సంక్షేమ పథకాల అమలుకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తున్న ఘనత కేసీఆర్ ది

వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 140 మంది లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరైన రూ.44.52 లక్షల విలువైన చెక్కులను అందజేసి అనంతరం శ్రావణ శనివారం సంధర్భంగా వనపర్తి తిరుమలయ్య గుట్టను సందర్శించి తిరుమలేశుని సందర్శించుకుని, అంజనేయస్వామి ఆలయం వద్ద అన్నదానంలో పాల్గొని భక్తులకు స్వయంగా వడ్డించిన  రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, పాల్గొన్న జడ్పీ చైర్మన్ లోక్ నాథ్ రెడ్ది గారు