వనపర్తి జిల్లా కేంద్రంలో MB GARDEN కళ్యాణ మండపంలో “జాగృతి కళాశాల ద్వితీయ సంవత్సరం విద్యార్థులు”ప్రథమ సంవత్సరం విద్యార్థుల కోసం ఏర్పాటు చేసి స్వాగత కార్యక్రమంలో (FRESHER’S DAY) S……….. విద్యార్థులు ,తల్లిదండ్రులు ,
వనపర్తి టౌన్ : అక్టోబర్23 (జనంసాక్షి ) వనపర్తి జిల్లా కేంద్రంలో MB GARDEN కళ్యాణ మండపంలో “జాగృతి కళాశాల ద్వితీయ సంవత్సరం విద్యార్థులు”ప్రథమ సంవత్సరం విద్యార్థుల కోసం ఏర్పాటు చేసి స్వాగత కార్యక్రమంలో (FRESHER’S DAY) S……….. విద్యార్థులు ,తల్లిదండ్రులు ,
ప్రిన్సిపాల్, యాజమాన్యం సభ్యులు,అధ్యాపక బృందం అధ్యాపకేతర బృందం పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ అంబటి వినోద్ కుమార్ మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలోనే గత 11 సంవత్సరాల నుండి సాధారణ విద్యార్థులతో విద్యార్థులతో కార్పొరేట్ కళాశాల దీటుగా స్టేట్ ఫస్ట్ సెకండు వంటి ర్యాంకులను వరుసగా సాధిస్తూ ఈ విద్యా సంవత్సరం 2022 లో MPC లో రెండు స్టేట్ ఫస్ట్ ర్యాంకులు 467/470 సాధించి ఉమ్మడి జిల్లాల్లోనే సరికొత్త రికార్డు సృష్టించారు. అదేవిధంగా BiPC లో ఇద్దరు విద్యార్థులకు 436 మార్కులతో స్టేట్ సెకండ్MEC లో 485,CEC లో 485 వంటి రాష్ట్రస్థాయి మార్కులను సాధించారు అని తెలుపుటకు ఎంతో గర్వపడుతున్నాం,యాజమాన్య సభ్యులు మాట్లాడుతూ సాధారణమైన ఫీజులతో గ్రామస్థాయి నుండి వచ్చిన సాధారణ విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తూ విద్యార్థులను సహస్రస్థాయిలో మొదటి స్థానంలో నిలబెడుతున్న ఏకైక కళాశాల మా జాగృతి కళాశాల అని తెలుపుటకు ఎంతో సంతోషం వ్యక్తపరుస్తున్నాము.
ప్రథమ సంవత్సరంలో రాష్ట్రస్థాయిలో 1,1,2,,2,3,3,4,5,6,7,7,7,8,8, 9,9,10 ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ద్వితీయ సంవత్సరంలో రాష్ట్రస్థాయి మార్కులతో ప్రభంజనం సృష్టించిన విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు శాలువా బోకే, మేమెంట్లతో ఘనంగా సన్మానించారు.అదేవిధంగా 2022 JEE MEAINS మరియు NEET లో ALL INDIA స్థాయిలో ర్యాంకులు సాధిస్తున్న ఏకైక కళాశాల మా జాగృతి కళాశాల అని తెలుపుటకు ఎంతో సంతోషిస్తున్నాము
మధ్యాహ్న కళాశాలలో సంస్కృతిగా కార్యక్రమంలో తెలంగాణ బోనాలు మరియు బతుకమ్మ పండుగలా నృత్యాలతో పాటలతో విద్యార్థులు అల్లరించారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ అంబటి వినోద్ కుమార్ యాజమాన్య సభ్యులు శ్యాం కుమార్ భాస్కర్ సత్యనారాయణ కళాశాల అధ్యాపక బృందం, అధ్యాపకేతర బృందం మరియు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.