వనపర్తి జిల్లా బిజెపి కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి…
ఈరోజు వనపర్తి జిల్లా బిజెపి కార్యాలయంలో నవంబర్ 26 రాజ్యాంగ దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. రాష్ట్ర బిజెపి కార్యవర్గ సభ్యులు,బి. కృష్ణ మాట్లాడుతూ,రాజ్యాంగ సభ 1949 సంవత్సరంలో నవంబర్26న భారత రాజ్యాంగ ఆమోదించబడింది .తర్వాత 1950 జనవరి 26 నుంచి అమలులోకి వచ్చిందని, ప్రతి సంవత్సరం నవంబర్ 26వ తేదీన భారతదేశం రాజ్యాంగ దినోత్సవం గుర్తించారు. రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడిగా ఉన్న డాక్టర్ రాజేంద్రప్రసాద్ రాజ్యాంగాన్ని తెలియజేశారు. అన్ని రాజకీయ పార్టీలు రాజకీయాన్ని అంగీకరించాయి. మరియు గుర్తించాయి.దానికి తమ విధేతను ప్రతిజ్ఞ చేశారు. కమిటీలో భాగమైన మొత్తం రాజ్యాంగ సభ సభ్యుల సంఖ్య 389, రాజ్యాంగా రూపొందించే బాధ్యత మూసాయుధ కమిటీ చైర్మన్ గా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కి దక్కిందన్నారు. ప్రపంచ భారత రాజ్యాంగంలో 22 భాగాలు 448 ఆర్టికల్చర్ మరియు 12 షెడ్యూల్ కులాలుగా కలిగిన భారత రాజ్యాంగంలో పౌరులు, న్యాయం స్వేచ్ఛ ,సమానత్వం, వంటి హక్కులు నొక్కి చెప్పబడ్డాయి.అలాగే భారత ప్రభుత్వం న్యాయమైన రాజ్యాంగ ప్రకారం స్వతంత్ర ఉంచబడుతుంది .రాజ్యాంగం ప్రకారం భారత పౌరులు ఇవ్వబడిన అన్ని ప్రాథమిక హక్కులు వివక్ష లేకుండా ఉన్నాయిని, ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి.కృష్ణ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి డి.నారాయణ, బుడ్డన్న, రామన్ గౌడ్ ,పట్టణ అధ్యక్షులు రామమోహన్ ప్రధాన కార్యదర్శిలు సుగురూ రాములు, రాయన్న, బిజెపి నాయకులు, మహేందర్, కిషన్ మోర్చా నాయకులు వెంకటేష్ నాయుడు, జ్ఞానేందర్, తదితరులు పాల్గొన్నారు.