వనపర్తి పల్లెనిద్రలు చారిత్రాత్మకం కావాలి

ప్రజా సమస్యల పరిష్కారంలో ఇతరులకు ఆదర్శం కావాలి

ప్రజల భాగస్వామ్యం పెంచడం, వారి సమస్యల పరిష్కారం కోసమే పల్లెనిద్రలు

గత ఎనిమిదేళ్లుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నాను

అనేక ప్రజా సమస్యల పరిష్కారానికి పల్లెనిద్రలు ఉపయోగపడ్డాయి

కర్నెతండా మీదుగా బలిజపల్లి అటవీ రోడ్డు, కరంటు సమస్యలు తీర్చేందుకు సబ్ స్టేషన్ ఏర్పాటుచేశాం

సాగునీటి కోసం రూ.76.19 కోట్లతో కర్నెతండా ఎత్తిపోతల సాధించాం

గిరిజనుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కర్నె తండాకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తీసుకువచ్చాం

 

ఆముదంబండ తండాలో గిరిజన భవన్ కు త్వరలో నిర్మాణం

గ్రామ అభివృద్ధికి ప్రతినెలా ప్రభుత్వం నిధులు ఇస్తున్నది

రైతుబంధు కింద ఈ తండాలో 185 మంది రైతులకు ఈ వానాకాలం రూ.25.51 లక్షలు వారి ఖాతాలలో జమచేయడం జరిగింది

వివిధ కారణాలతో మరణించిన నలుగురు రైతులకు వారి కుటుంబాలకు రైతుభీమా కింద రూ.5 లక్షల సాయం

27 మందికి కళ్యాణలక్ష్మి కింద రూ.లక్ష 116

27 మందికి కేసీఆర్ కిట్ – అమ్మవడి పథకం

రూ.32 లక్షలతో మిషన్ భగీరధ కింద తాగునీటి సౌకర్యం

రూ.7 లక్షలతో మిషన్ కాకతీయ కింద చాతృకుంటకు మరమ్మతులు

తెలంగాణ రాష్ట్రంలో గ్రామాల ముఖచిత్రం సంపూర్ణంగా మారిపోయింది

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుమూలంగా తండాలు గ్రామపంచాయతీలు అయ్యాయి

మన తండాలో మన రాజ్యం అన్న గిరిజనుల కల నెరవేరింది

మీ తండాలను మీరే అభివృద్ధి చేసుకునే అవకాశం లభించింది

గత ఎన్నికలకు ముందు ముంబయి వెళ్తే దాదాపు 4 వేల మంది గిరిజనులు సమావేశానికి వచ్చారు

ఇటీవల మళ్లీ ముంబయి వెళ్లితే 1500 మంది మాత్రమే కనిపించారు .. సాగునీటి రాకతో వలసలు తగ్గాయని వారు చెప్పడం సంతోషం అనిపించింది

వనపర్తి నియోజకవర్గం ఖిల్లాఘణపురం మండలం ఆముదంబండ తండాలో పల్లెనిద్ర కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు

వనపర్తి నియోజకవర్గ వ్యాపితంగా
రాష్ట్రంలోనే తొలిసారి ఈ రోజు రాత్రి వనపర్తి నియోజకవర్గంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారి సూచనల మేరకు వనపర్తి వజ్ర సంకల్పం పేరుతో 53 శాఖలకు చెందిన అధికారులతో 41 గ్రామాలు, 9 మున్సిపల్ వార్డులు మొత్తం 50 ఆవాసాలలో పల్లెనిద్ర కార్యక్రమం.

ఖిల్లా ఘణపురం మండలకేంద్రంలో పల్లె నిద్రకు హాజరైన జిల్లా కలెక్టర్ షేక్ యాస్మీన్ భాషా గారు

ఖిల్లాఘణపురం మండలం కమాలుద్దీన్ పూర్ లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశీష్ గారు

ఖిల్లాఘణపురం మండలం మామిడిమాడలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్ గారు

రేవల్లి, గోపాల్ పేట, ఖిల్లాఘణపురం, పెద్దమందడి, శ్రీరంగాపురం, వనపర్తి మండలాలలో
6 గ్రామాల చొప్పున, పెబ్బేరు మండలంలో 5 గ్రామాల్లో పల్లె నిద్ర ,

పెబ్బేరు మునిసిపాలిటీలో 3 వార్డులు, వనపర్తిలో ఆరు వార్జులలో పల్లెనిద్రలు

ప్రజల నుండి అధికారుల దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ