వయనాడ్ గబ్బిలాల్లో నిపా వైరస్..
` ధృవీకరించిన ఐసీఎంఆర్
తిరువనంతపురం(జనంసాక్షి): కేరళలోని వయనాడ్ జిల్లాలో ఉన్న గబ్బిలాల్లో నిపా వైరస్(ఔతిజూజీష్ట్ర లతితీబీబ) ఉన్నట్లు ఐసీఎంఆర్ ద్రువీకరించింది. కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ ఈ విషయాన్ని ఇవాళ వెల్లడిరచారు. సుల్తాన్ బతేరి, మనంతవాది ఏరియాల్లో ఉన్న గబ్బిలాల్లో నిపా వైరస్ ఉన్నట్లు గుర్తించామన్నారు. ఐసీఎంఆర్ ఇచ్చిన నివేదికలో ఈ విషయం నిర్ధారణ అయినట్లు మంత్రి వీణా తెలిపారు. దీంట్లో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు ఈ వార్నింగ్ ఇస్తున్నట్లు మంత్రి చెప్పారు. నిపాపై పరిశోధన కోసం కోజికోడ్ మెడికల్ కాలేజీలో కేరళ వన్ హెల్త్ సెంటర్ ప్రారంభంకానున్నట్లు తెలిపారు. జంతువులు, పక్షలు కొరికిన పండ్లను తినకూడదని మంత్రి సలహా ఇచ్చారు. ఇతర జిల్లాల్లోనూ నిపా వైరస్ ఉందా లేదా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు ఆమె చెప్పారు.