వయోవృత్తుల చట్టాలపై అవగాహన సదస్సు
నల్గొండ బ్యూరో, జనం సాక్షి,
రాస్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాల మేరకు మరియు నెలవారీ కార్యక్రమాలలో భాగంగా నల్గొండ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ మరియు జిల్లా మహిళా, శిశు, వయో వృద్దుల, దివ్యాంగుల సంక్షేమ శాఖ, నల్లగొండ వారి సంయుక్త ఆద్వర్యం లో శనివారం అంతర్జాతీయ వయో వృద్దుల దినోత్సవం సందర్బంగా పి.ఏ.పల్లి మండలం గుడిపల్లి గ్రామం లో రైతు వేదిక వద్ద వయో వృద్ధుల చట్టలపై అవగాహన సదస్సు నిర్వహించబడినది. ఈ కార్యక్రమంలో వయో వృద్ధుల హక్కులు వారి సంక్షేమం గురించి, ప్రభుత్వం తరుపున వారికి అందిస్తున్న సదుపాయాలను గురించి తెలియబరచటమైనది. ఈ సందర్బంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీమతి బి. దీప్తి మాట్లాడుతూ వృద్దులను నిర్లక్ష్యం చేయకుండా దయతో, ఓర్పుతో వారిని సంరక్షించాలని, వారికి తగిన సదుపాయాలను ఏర్పరచి వారి జీవిత చరామాంకంలో తృప్తిగా సంతోషంగా జీవించేలా చూడాలని హితవు పలికారు. వారికి ప్రభుత్వం తరుపున వున్న పథకాలు, వసతులు సక్రమంగా అందేలాగా చూడాలని సంబంధిత అధికారులను కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్, యం. పి. టి.సి., మహిళా స్త్రీ, శిశు సంక్షేమశాఖ అధికారులు& సిబ్బంది పాల్గొన్నారు. తరువాత దేవేరకొండలో గల మహాలక్ష్మి మహిళా మండలి వయో వృద్దుల ఆశ్రమాన్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సందర్శించి అక్కడ వున్న వృద్దులతో మాట్లాడి వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా ఆశ్రమంలో పరిసరాలు, మరుగుదొడ్లు అపరిశుభ్రంగా వున్నాయని గమనించి నిర్వహణ లోపాలను సరిదిద్దుకొని వృద్దుల ఆరోగ్యాన్ని కాపాడాలని అక్కడి సిబ్బందిని హెచ్చరించారు. ఇందులో దేవేరకొండ జూనియర్ సివిల్ జడ్జ్, పి. రవీంధర్ మరియు అదనపు సివిల్ జడ్జ్ అజై గార్లు కూడా పాల్గొన్నారు.