వయో వృద్ధుల దినోత్సవ ర్యాలీని ప్రారంభించిన జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని జయంతి…
జనగామ( జనం సాక్షి) సెప్టెంబర్ 30.అక్టోబర్ 1 అంతర్జాతీయ వయోవృద్ధుల వారోత్సవాలను పురస్కరించుకొని శుక్రవారం నెహ్రూ చౌక్ నుండి బస్టాండ్ వరకు చేపట్టిన ర్యాలీని జిల్లా మహిళా శిశు సంక్షేమం దివ్యాంగుల సంక్షేమం వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారిని జయంతి జెండా ఊపి ప్రారంభించారు. వయోవృద్ధులకు తగిన గౌరవం ఇవ్వాలని వారికి సమాజంలో సముచిత స్థానాన్ని ఇచ్చి గౌరవించాల్సిన అవసరం ఉందని మహిళా సంక్షేమ అధికారిని తెలియజేశారు.ప్రతి ఇంటిలో వయోవృద్ధులు ఉంటారని వారి సహకారంతోనే ఎటువంటి సమస్యలైనా అవలీలగా అధిగమించవచ్చునన్నారు .కుటుంబ పెద్దలను గౌరవించుకోవడం మన సాంప్రదాయం అన్నారు ఈ సంస్కృతి సాంప్రదాయాలను కుటుంబ సభ్యులందరికీ చిన్నతనం నుండే నేర్పించాల్సిన అవసరం ఉందన్నారు.సమాజంలో వయోవృద్ధుల సేవలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలియజేశారు తమ శాఖ పరంగా ఎటువంటి సమస్యలు ఉన్న పరిష్కరిస్తామన్నారు
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాము, సీఐ శ్రీనివాస్, సామాజిక కార్యకర్త సాదిక్ సిడిపిఓ రమాదేవి వయోవృద్ధులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.