వరంగల్‌కు ఔటర్‌ రింగ్‌ రోడ్డు

– 74కి.విూ పోడవుతో ఔటర్‌ రింగ్‌రోడ్డు నిర్మాణం
– త్వరలో వరంగల్‌కు మరో ఐదు ఐటీ ప్రాజెక్టులు
–  కాజీపేట ఆర్వోబీని నాలుగు లైన్‌ల రోడ్డుగా మారుస్తాం
– మెగా టెక్స్‌టైల్‌  ప్రార్క్‌ తో అభివృద్ధి పథంలో వరంగల్‌ జిల్లా
– కాళేశ్వరం పూర్తయితే ఎక్కువ లబ్ధి పొందేది ఉమ్మడి వరంగల్‌ జిల్లానే
– డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి
వరంగల్‌, జనవరి25(జ‌నంసాక్షి) : హైదరాబాద్‌ తరహాలో వరంగల్‌కు ఔటర్‌ రింగ్‌ రోడ్డును నిర్మిస్తామని డిప్యూటీ సీఎం, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి హావిూ ఇచ్చారు. వరంగల్‌ నగరంతోపాటు జనగామ, మహబూబాద్‌ పట్టణాలకు జాతీయ రహదారులను ఉపయోగించుకొని 74 కిలోవిూటర్ల పొడవుతో ఈ రింగురోడ్డును నిర్మించనున్నట్లు మంత్రి వెల్లడించారు. గురువారం డిప్యూటీ సీఎం కడియం విలేకరులతో మాట్లాడారు.. వరంగల్‌కు మొత్తం 12 కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకున్నదన్నారు. మెగా టెక్స్‌టైల్‌ పార్కుతో వరంగల్‌ జిల్లా అభివృద్ధి చెందుతున్నదన్నారు. కాజీపేట ఆర్వోబీని 4 లైన్‌ రోడ్డుగా మారుస్తున్నమని మంత్రి గుర్తు చేశారు. తర్వలోనే వరంగల్‌కు మరో మూడు ఐటీ ప్రాజెక్టులు రాబోతున్నాయని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడిన 44 నెలల్లో… 36 నెలలు డిప్యూటీ సీఎంగా కొనసాగడం ఆనందాన్ని ఇచ్చిందని, అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్‌ కి జిల్లా ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. 40వేల కోట్లతో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని, అభివృద్ధిలో, సంక్షేమంలో.. గ్రోత్‌లో దేశంలోనే తెలంగాణ ప్రభుత్వం ముందుందని కడియం పేర్కొన్నారు. తెలంగాణ విఫల ప్రయోగం అవుతుందని అందరూ భావించారని, కానీ సీఎం కేసీఆర్‌ పరిపాలనా దక్షతతో దేశంలో నెంబర్‌ వన్‌ గా నిలిచిందన్నారు. వరంగల్‌ అభివృద్ధి వైపు పరుగులు పెడుతుందన్న కడియం..  సీఎం కేసీఆర్‌ వరంగల్‌ అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. హైదరాబాద్‌ తర్వాత వరంగల్‌ కి అభివృద్ధిలో అత్యధిక నిధులు కేటాయిస్తున్నారన్నారు. వలస వెళ్లిన నేతన్నలను తిరిగి రప్పించేందుకు వరంగల్‌ లో కాకతీయ మెగా టెక్స్‌ టైల్‌ పార్క్‌ ఏర్పాటు చేస్తున్నామని కడియం తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిదంగా ఫార్మ్‌ టూ ఫ్యాషన్‌ వరంగల్‌ టెక్స్‌ టైల్స్‌ పార్క్‌ ఏర్పాటు చేస్తున్నామన్నారు. రూ.78 కోట్లతో ఫాతిమలో ఆర్వోబి మంజరి చేశారని తెలిపారు. వరంగల్‌ లో ఐటీ పార్క్‌ విస్తరణకు మంత్రి కేటీఆర్‌ అనుమతి ఇచ్చారని, త్వరలో మరికొన్ని ఐటీ పార్కులు రానున్నాయని కడియం తెలిపారు. తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీరు అందించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారని, అందులో భాగంగా ఎస్సారెస్పీ కాలువల మరమ్మతులకు నిధులు కేటాయించారన్నారు. టెయిల్‌ ఎండ్‌ కు నీళ్లు ఇవ్వడమే లక్ష్యంగా కాలువలను ఆధునీకరణ చేస్తున్నామని, కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పూర్తయితే మొదటగా లబ్ధి పొందే ఉమ్మడి వరంగల్‌ జిల్లానేని కడియం స్పష్టం చేశారు. దేవాదుల ఎత్తిపోతల పథకం పూర్తి ఆయకట్టుకు నీరందించాలని కోరితే కేసీఆర్‌ అదనంగా నిధులు కేటాయించారన్నారు.  తుపాకుల గూడెంలో బ్యారేజి నిర్మాణానికి రూ.1600 కోట్లు కేటాయించాన్నారు.  మల్కాపూర్‌ లో 10.7 టీఎంసీ ల సామర్ధ్యంతో రిజర్వాయర్‌ నిర్మాణానికి త్వరలో టెండర్లు వేస్తామని, మల్కాపూర్‌ రిజర్వాయర్‌ లో నీళ్లు ఉంటే వరంగల్‌ తల విూద నీళ్లు ఉన్నట్లే.నని కడియం తెలిపారు. వరంగల్‌ లో రోడ్ల నిర్మాణానికి అధిక నిధులు వచ్చాయని,  వరంగల్‌ నగరంతోపాటు జనగామ, మహబూబాద్‌ పట్టణాలకు జాతీయ రహదారులను ఉపయోగించుకొని ఔటర్‌ రింగ్‌ రోడ్డు వేయనున్నామని తెలిపారు. వరంగల్‌ పట్టణంపై సీఎం కేసీఆర్‌ కు ఉన్న ప్రత్యేక శ్రద్ధతో నగరాభివృద్ధికి 300 కోట్లు కేటాయిస్తున్నారు. వరంగల్‌ ని ఎడ్యుకేషన్‌ హబ్‌ గా తీర్చిదిద్దామని, దేశంలో ఎక్కడా లేనివిధంగా విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. జిల్లాను ప్రగతి పథంలో నిలిపేందుకు కృషి చేస్తామని డిప్యూటీ సీఎం కడియం స్పష్టం చేశారు.