వరంగల్‌లో భారీ మెజారిటీతో గెలుస్తాం
– ప్రత్యర్థులకు అభ్యర్ధుల కరువు
– మంత్రి హరీశ్
వరంగల్, నవంబర్4(జనంసాక్షి):
వరంగల్ లోక్‌సభ ఉపఎన్నికలో టీఆర్‌ఎస్ పార్టీకి భారీ మెజార్టీ ఇవ్వడం ద్వారా ఓరుగల్లు ప్రజలు ప్రతిపక్షాల నోళ్లు మూయించాలని ఉమముఖ్యమంత్రి కడియం శ్రీహరి వరంగల్ ఓటర్లను కోరారు. గెలుపు ఖాయమైనా మెజార్టీతో విపనక్షాలకు బుద్ది చెప్పాలని అన్నారు. ప్రతిపక్షాల నోరు మూయించాంటే టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి పసునూరి దయాకర్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని
ఆయన అన్నారు. ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా హన్మకొండలో టీఆర్‌ఎస్ పార్టీ భారీ బహిరంగ సభను నిర్వహించింది. ఇందులో మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మనసున్న మహారాజని, . అన్ని వర్గాలకు పెన్షన్లు ఇస్తున్నడని అన్నారు రైతుల సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టడమే గాకుండా 17 వేల కోట్ల రుణాలను ఇప్పటికే మాఫీ చేశామన్నారు. ఇప్పటికే అందులో 8,250 కోట్లను చెల్లించినట్లు వెల్లడించారు. బీజేపీ సిగ్గులేకుండా ప్రవర్తిస్తోందని, పత్తికి రూ. 5 వేల మద్దతు ధర ఇస్తామని మాట తప్పిందన్నారు. ఈ ఎన్నిక ద్వారా బీజేపీకి గుణపాఠం చెప్పాలన్నారు. వరంగల్ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి దేవయ్య కోట్లు సంపాదించాడేమో గానీ ఓరుగల్లు ప్రజల ఓట్లు మాత్రం సంపాదించలేడని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సభకు రాష్ట్ర మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, స్థానిక టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బహిరంగ సభకు విచ్చేసిన అశేష జనవాహినిని ఉద్దేశించి మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. గతంలో జరిగిన ఉప ఎన్నికల్లో తెలంగాణ ఆకాంక్షను చాటిచెప్పినట్లు తెలిపారు. . కానీ ఈ ఉపఎన్నిక అభివృద్ధి సాధకులకు, అభివృద్ధి నిరోధకులకు మధ్య జరుగుతున్నదన్నారు. ఎన్నికల్లో పోటీ చేయడానికి టీడీపీ భయపడ్తున్నదని, అందుకే వరంగల్ ఎంపీ స్థానాన్ని బీజేపీకి కేటాయించి తప్పుకున్నదని ఎద్దేవా చేశారు. . పార్టీలో మొన్నటిదాక సభ్యత్వం లేని వ్యక్తికి టికెట్ ఇచ్చిన దీన స్థితి బీజేపీదన్నారు. ఎక్కడో ఉన్న వ్యక్తిని ఏరుకుని పట్టుకుని వచ్చారన్నారు. . అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ తెలంగాణను పట్టించుకోలేదు. ఏం చూసి కాంగ్రెస్, బీజేపీలకు ఓటెయ్యాలి. టీడీపీ, బీజేపీలు తెలంగాణకు కరెంటు ఇవ్వకుండా అడ్డుకున్నయి. బీజేపీ అభ్యర్థి కోట్లు సంపాదించాడమో గానీ వరంగల్ ప్రజల ఓట్లు సంపాదించలేడని మంత్రి అన్నారు. సీఎం కేసీఆర్ వరంగల్ ఆత్మగౌరవాన్ని ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లారు. వరంగల్‌లో హైదరాబాద్ పబ్లిక్‌స్కూల్‌ను ఏర్పాటు చేశాం. హెల్త్ యూనివర్సిటీని కేటాయించారన్నారు. అదేవిధంగా టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి పసునూరి దయాకర్ గురించి మాట్లాడుతూ.. తెలంగాణ తల్లి రూప శిల్పి దయాకర్. 14 ఏళ్ల పాటు పార్టీని వెన్నంటి ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న వ్యక్తి. తెలంగాణ ఏర్పాటు కోసం జైలుకు వెళ్లాడు. ఇటువంటి నిబద్ధత కలిగిన వ్యక్తిని అభివృద్ధి కాముకులైన వరంగల్ ఓటర్లు భారీ మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.
పసునూరి దయాకర్ అందరి వాడు అని ఎమ్మెల్యే రాజయ్య అన్నారు. అభ్యర్థి ప్రకటనతో టీఆర్‌ఎస్ గెలుపు ఖరారైందని మాజీ మంత్రి రెడ్యా నాయక్ తెలిపారు. అతి తక్కువ సమయంలోనే టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని ఎమ్మెల్యే కొండా సురేఖ గుర్తు చేశారు. వరంగల్ అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ఎమ్మెల్యే ధర్మారెడ్డి తెలిపారు. బహిరంగ సభకు జనం భారీగా తరలివచ్చారు.