వరంగల్‌లో వైద్య విద్యార్థుల హెల్త్‌రన్
వరంగల్: వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కాలేజి విద్యార్థులు హెల్త్‌రన్ నిర్వహించారు. కాకతీయ మెడికల్ కాలేజి నుంచి పబ్లిక్ గార్డెన్ వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఉత్కర్ష 2012లో భాగంగా కాకతీయ మెడికల్ విద్యార్థులు, శ్రీనివాస హార్ట్ ఫౌండేషన్ వారి సౌజన్యంతో గుండె జబ్బులు, వాటి నివారణ చర్యలపై అవగాహన కల్పించేందుకు ఈ ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలియజేశారు.