వరంగల్‌ ఉప ఎన్నిక ప్రశాంతం

2
– 68.59 శాతం ఓటింగ్‌

– భన్వర్‌ లాల్‌

వరంగల్‌,నవంబర్‌21(జనంసాక్షి): వరంగల్‌ లోక్‌సభ ఉప ఎన్నికల పోలింగ్‌ పర్వం ప్రశాంతంగా  ముగిసింది.  ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్‌ పక్రియ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. క్యూలో నిల్చున్న వారికి ఇంకా ఓటు వేసేందుకు అనుమతించారు.68.59 శాతం ఓటింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారి భన్వర్‌ లాల్‌ తెలిపారు.సాయంత్రం అయ్యేసరికి క్యూలైన ఇంఆ ఓటర్లు ఉండంతో వారందరికీ ఓటు వేసే అవకాశాన్ని కల్పించారు.మొత్తానికి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా వరంగల్‌ లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 23మంది అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. సాయంత్రం 5గంటల సమయానికి క్యూలో నిల్చున్న వారికి ఓటు వేసేందుకు అధికారులు అనుమతి ఇచ్చారు. ఈనెల 24న ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు జరగనుంది.వరంగల్‌ పార్లమెంటు స్థానానికి జరుగుతున్న పోలింగ్‌ ప్రశాంతంగా జరుగుతుండగా…. ఓ పోలింగ్‌ కేంద్రంలో విద్యుత్‌ సరఫరా లేక కొవ్వొత్తుల వెలుగులో పోలింగ్‌ కొనసాగుతోంది. హన్మకొండ ఆర్ట్స్‌ కాలేజీ పోలింగ్‌ కేంద్రంలో విద్యుత్‌ సౌకర్యం లేదు. దీంతో అధికారులు కొవ్వొత్తులను ఏర్పాటు చేశారు. అలాగే పాలకుర్తి మండలం తీగారంలో ఈవీఎం మొరాయించడంతో 30 నిమిషాలు పోలింగ్‌కు అంతరాయం ఏర్పడింది. ఇక పరకాల మండలం వెంకటేశ్వరపల్లిలో కూడా ఈవీఎం మొరాయించడంతో గంట ఆలస్యంగా పోలింగ్‌ ప్రారంభమైంఈ ఉప ఎన్నికకు మొత్తం 1,778 పోలింగ్‌ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేసింది. ఓటర్లు ఉదయం నుంచే తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్‌ కేంద్రాలకు వచ్చారు. తొలిసారి ఈవీఎంలపై అభ్యర్థుల ముఖచిత్రాలు ఏర్పాటు చేశారు. వరంగల్‌ లోక్‌సభ ఉప ఎన్నికల్లోనూ నోటాకు అవకాశం కల్పించారు. పోలింగ్‌ కేంద్రాల్లో మొదటి ఓటరుకు అధికారులు పువ్వు అందజేసి స్వాగతం పలికారు. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వడ్డేపల్లిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్‌ దంపతులు కొడకండ్ల పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు. తెరాస అభ్యర్థి పసునూరి దయాకర్‌ సంగెం మండలం బొల్లికుంట పోలింగ్‌ కేంద్రంలో, తెదేపా నేత

ఎర్రబెల్లి దయాకర్‌రావు పర్వతగిరి పోలింగ్‌ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.