వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిని పరిశీలించిన టీడీపీ బృందం
వరంగల్: ఎంజీఎం ఆసుపత్రిని తేదేపా బృందం పరిశీలించింది. సౌకర్యాలు కల్పించే విషయంలో నొర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని రేవూరి ప్రకాశ్ రెడ్డి మండిపడ్డారు. వెంటిలేటర్ కొరతవల్ల పసిపిల్ల మరణాలు పేరిగాయని సీతక్క అన్నారు. పిల్లల వార్డుల్లో రోగులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో సమస్యలపై వైద్యులతో సమావేశమయ్యారు. వేయి పడకల ఆసుపత్రిలో అనేక సమస్యలున్నాయని 15రోజుల్లో సమస్యలు పరిష్కరించకపోతే తేదేపా ఆందోళన ఉదృతం చేస్తామని అన్నారు. ఆసుపత్రిని పరిశీలించిన వారిలో సత్యావతిరాథోడ్, ఎంపీ గుండు సుధారాణీ ఉన్నారు.