వరంగల్ సమగ్రాభివృద్దికి యత్నాలు
మాస్టర్ ప్లాన్ ద్వారా ప్రణాళికలు
ఇప్పటికే పలుదఫాలుగా చర్చలు
వరంగల్,అక్టోబర్29(జనం సాక్షి ): తెలంగాణలో హైదరాబాద్ తర్వాత పెద్దదైన వరంగల్ నగర సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రావిూణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఇటీవల వరంగల్ మాస్టర్ ప్లాన్‌పై పలుదఫాలుగా చర్చలు సాగాయి. కెటిఆర్ కూడా వరంగల్ విస్తరణకు ఉన్న అవకాశాలపై చర్చించారు. దీంతో ఇక్కడ అభివృద్ది కార్యక్రమాలపై నేతలు కూడా తమవంతుగా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. భవిష్యత్తు తరాల అవసరాలకు తీర్చడమే లక్ష్యంగా, సరికొత్త తరహాలో అభివృద్ధి జరిగేలా వరంగల్ నగరం మాస్టర్‌ప్లాన్‌ని రూపొందిస్తు న్నట్లు తెలిపారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ప్రజల సూచనలు పరిగణలోకి తీసుకొని అన్ని అంశాలను మాస్టర్‌ప్లాన్‌లో చేర్చనున్నారు. రానున్న దశాబ్ద కాలంలో అభివృద్ధిపరంగా నగరం సరికొత్త పుంతలు తొక్కాలని, ఆ దిశగా మాస్టర్‌ప్లాన్ ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. హైదరాబాద్ తర్వాత రెండవ పెద్ద నగరం వరంగల్ అని, ఈ నగరం చారిత్రా త్మక ప్రాధాన్యత సంతరించుకోవడంతో పాటు కాకతీయులు పాలించిన నగరంగా ప్రఖ్యాతి గాంచింది. ఇక్కడ పురాతన కట్టాడాలు గుట్టలు ఎన్నో ఉన్నాయని తెలిపారు. వీటిని సైతం మాస్టర్ ప్లాన్‌లో చేర్చడం జరిగిందన్నారు. నగర అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రత్యేక శ్రద్ధతో ఉన్నారు. అంతేకాక అభివృద్ధ్దిలో కీలకమైన మాస్టర్‌ప్లాన్ సమగ్రంగా ఉండాలని మంత్రి కేటీఆర్ సూచించారు. వరంగల్‌కు ఉన్న చారిత్రక ప్రాధాన్యత పెంచేలా, అలాగే పర్యాటక కేంద్రంగా అభివృద్ధి జరిగేలా అన్ని అంశాలు పొందుపరచాలని అన్నారు. ఈ ప్లాన్ అమోదం పొందితే వరంగల్ నగర ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని పేర్కొన్నారు. రంగల్ నగరం అభివృద్ధ్దికి కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) పెద్ద బలంగా ఉండాలని, అందుకుగాను ఆర్థికంగా బలోపేతం కావాల్సిన అవసరం ఉందని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. ఇందుకు ప్రత్యేక ప్రణాళికులు ఉండాలని చెప్పారు. హైదరాబాద్‌లోని హెచ్ఎండీఏ తరహాలో కూడా కొత్తగా అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టడంతో పాటు ప్రభుత్వ భూములను గుర్తించి వెంచర్లను అభివృద్ధి చేసి ఎక్కువ ఆదాయం వచ్చేలా ప్రణాళికలు రూపొందించాని మంత్రి దయాకర్‌రావు అధికారులను ఆదేశించారు