వరంగల్ స్థానిక సంస్థల నుంచి పోచంపల్లి
నామినేషన్‌స్థానికి సంస్థలను బలోపేపేతం చేసిన ఘనత కేసిఆర్‌దే
వరంగల్,నవంబర్22(జనం సాక్షి): ఉమ్మడి వరంగల్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా టీఆర్‌ఎస్ నుంచి పోచంపల్లి సోమవారం శ్రీనివాస్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్‌తో కలిసి తన నామినేషన్ పత్రాలను శ్రీనివాస్ రెడ్డి వరంగల్ జిల్లా కలెక్టర్ గోపీకి అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, బండ ప్రకాష్, నర్సంపేట, వరంగల్ తూర్పు ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి నన్నపునేని నరేందర్, ములుగు జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ జగదీశ్వర్, వరంగల్ నగర పాలక సంస్థ మేయర్ గుండు సుధారాణి, వరంగల్ జడ్పీ వైస్ చైర్మన్ ఏ శ్రీనివాస్, జడ్పీలో టీఆర్‌ఎస్ ప్లోర్ లీడర్ పెద్ది స్వప్న తదితరులు పాల్గొన్నారు. ఈ సండర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ ఎంపీటీసీల గౌరవ వేతనం పెంచామని… ఇంకా పెంచుతామని తెలిపారు. ఎంపీటీసీలకు నిధులు కేటాయిస్తామన్నారు. రెచ్చగొట్టే నేతలకు ఎంపీటీసీలు సరైన సమాధానం చెప్పాలన్నారు. పోచంపల్లి ఏకగ్రీవం అయ్యేలా అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ…వరంగల్ జిల్లా అంటే కేసీఆర్‌కు అభిమానమన్నారు. అందుకే ఎక్కువ ఎమ్మెల్సీ స్థానాలు వరంగల్‌కు ఇచ్చారని తెలిపారు. స్థానిక సంస్థలను బలోపేతం చేసిన రాష్ట్రం తెలంగాణ అని చెప్పుకొచ్చారు. పోచంపల్లిని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని కోరారు.